హైదరాబాద్: నిన్న రాత్రి స్థానిక జామియా మసీదులో తరావీహ్ నమాజ్ జరుగుతుండగా… శివాజీ మహారాజ్ జయంతి ఊరేగింపులో పాల్గొన్న కొంతమంది నినాదాలు చేయడంతో అంబర్‌పేటలో ఉద్రిక్తత నెలకొంది.
స్థానిక నివేదికల ప్రకారం…రాత్రి 10 గంటల ప్రాంతంలో మసీదులో నమాజ్ చేస్తున్న సమయంలో ఊరేగింపులో పాల్గొన్న కొందరు నినాదాలు చేయడంతో సమస్య చెలరేగింది. దీనికి నమాజ్ చేసుకుంటున్న వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వెంటనే అదనపు పోలీసులను సంఘటనా స్థలానికి తరలించారు.
సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత మూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని ముస్లిం పెద్దలతో చర్చలు జరిపి, ప్రశాంతంగా ఉండాలని కోరారు. కొంతమంది వ్యక్తులు నినాదాలు చేసిన తర్వాత ఈ సమస్య ప్రారంభమైందని, దీనిపై విచారణ జరుగుతోందని అన్నారు. “పరిస్థితి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ప్రజలు పుకార్లను నమ్మకూడదు” అని రక్షిత మూర్తి అన్నారు.

