Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

మోహన్ భగవత్ ‘ఘర్ వాపసీ’ పిలుపును ఖండించిన మౌలానా అర్షద్ మదానీ!

Share It:

న్యూఢిల్లీ: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల ఇచ్చిన “ఘర్ వాపసీ” పిలుపును జమాత్‌ ఉలేమా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర కలతపెడతాయని, భారతదేశ లౌకిక నిర్మాణానికి ప్రమాదకరమని ఆయన అభివర్ణించారు.

“ఇరవై కోట్ల మంది ముస్లింల”ను “ఘర్ వాపసీ” చేయించాలనే ఆలోచన గత ఏడు దశాబ్దాలుగా వినలేదని మదానీ ఎక్స్‌లో పేర్కొన్నారు.

దేశాన్ని… నాశనం, విధ్వంసం, అశాంతి, పరస్పర శత్రుత్వం వైపు నెట్టే ఏదైనా దేశానికి ద్రోహంగా పరిగణించరని ఆయన అన్నారు.

ఈమేరకు లక్నోలో జరిగిన ఒక సభలో భగవత్ ప్రసంగిస్తూ… హిందూ సమాజం అప్రమత్తంగా, ఐక్యంగా ఉండాలని, మరింత వ్యవస్థీకృతంగా ఉండాలని ఆయన నొక్కిచెప్పారు. హిందూ మతంలోకి తిరిగి వచ్చేవారికి సంరక్షణను హామీ ఇస్తూనే, తిరిగి మతమార్పిడి కోసం తీవ్ర ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చిన ఒక రోజు తర్వాత మదాని స్పందించారు.

హిందువులకు “ఎటువంటి ముప్పు” లేదని భగవత్ స్పష్టం చేశారు, కానీ జనాభా తగ్గుదల, బలవంతపు మతమార్పిడులపై జాగ్రత్త అవసరమని ఆయన నొక్కి చెప్పారు.

ఈ సందర్భంగా గో రక్షణ పేరుతో పదే పదే జరుగుతున్న హత్యలను మదాని ఎత్తి చూపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ” హింస వాతావరణం” నెలకొని ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం ఇటువంటి చర్యలపై గా మౌనంగా ఉందని, ఒక నిర్దిష్ట భావజాలాన్ని అనుసరించేవారు మాత్రమే భారతదేశంలో జీవించడానికి అర్హులని కొంతమంది గొంతులు ప్రచారం చేస్తూనే ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఇలా చేయడం భారత రాజ్యాంగం హక్కులను స్పష్టంగా ఉల్లంఘించడమేనని ఆయన పేర్కొన్నారు.

అటువంటి భావజాలాలు జాతీయ ఐక్యత, సమగ్రత , శాంతికి తీవ్రమైన ముప్పు కలిగిస్తున్నాయని మదాని హెచ్చరించారు. మతతత్వ, ద్వేషపూరిత రాజకీయాలకు జమియత్ ఉలామా-ఎ-హింద్ వ్యతిరేకమని ఆయన పునరుద్ఘాటించారు, వాటిని ప్రతిఘటించడం కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేశారు.

ముస్లింలు తమ విశ్వాసంలో స్థిరంగా ఉంటారని, భారతదేశంలో శాశ్వత శాంతి, సామరస్యం లౌకిక రాజ్యాంగ చట్రంలోనే సాధ్యమవుతుందని మదానీ దృఢంగా పేర్కొన్నారు.

ఏ మతం హింసను సమర్థించదని, అన్ని విశ్వాసాలు మానవత్వం, సహనం, ప్రేమ, ఐక్యతను ప్రబోధిస్తాయని ఆయన నొక్కి చెప్పారు. ద్వేషం, హింసను వ్యాప్తి చేయడానికి మతాన్ని ఉపయోగించుకునే వారు ఏ విశ్వాసానికి నిజమైన అనుచరులు కాలేరని ఆయన తేల్చిచెప్పారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.