జెరూసలెం: ఒక వారంలోపు గాజాలో యుద్ధాన్ని తీవ్రతరం చేయాలని ఇజ్రాయెల్ యోచిస్తున్నట్లు అభిజ్ఞ వర్గాలు తెలిపాయి, విద్యుత్ సరఫరాను నిలిపివేయడం, హత్యలు చేయడం, పాలస్తీనియన్లను ఉత్తర గాజా నుండి దక్షిణ గాజాకు తరలించడం వంటి ప్రణాళికలు ఇందులో ఉన్నాయి. ఇటీవలి నెలలతో పోలిస్తే ఇది ఉధృతంగా దాడి అని ఆ వర్గాలు అభివర్ణించాయి.
ఇజ్రాయెల్ హయోమ్ దినపత్రిక ప్రకారం… ఈ ప్రణాళికలో భాగంగా నీటి సరఫరాను తగ్గించడం, కొత్త US ప్రతిపాదనను అంగీకరించమని హమాస్‌ను ఒత్తిడి చేయడమే లక్ష్యంగా హత్యలు చేయడం కూడా ఉన్నాయని ఆ పత్రిక తెలిపింది.
ఆదివారం ముస్లింల పవిత్ర మాసం రంజాన్, యూదుల సెలవుదినం పాస్ ఓవర్ సందర్భంగా గాజాలో తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది, ఈ ఒప్పందం మొదటి దశ ముగిసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్యానికి ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ చేసిన ప్రతిపాదనను అనుసరించి… ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండేలా చూసుకోవాలని హమాస్ మధ్యవర్తులను కోరింది. రెండవ దశ చర్చలకు తక్షణం పిలుపునిచ్చింది.
మానవతా సహాయాన్ని నిరోధించాలనే నెతన్యాహు నిర్ణయాన్ని అరబ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇజ్రాయెల్ రాజకీయ నాయకులు, ఇజ్రాయెల్ బందీల కుటుంబాలు కూడా విమర్శించాయి, చర్చలను ప్రమాదంలో పడేస్తున్నాడని ఆరోపించారు.
గాజాలో ఇంకా 59 మంది బందీలు ఉన్నారని ఇజ్రాయెల్ అంచనా వేసింది, వీరిలో కనీసం 20 మంది బతికే ఉన్నారని, రెండవ దశలో కాల్పుల విరమణలో వారిని విడుదల చేయాలని భావిస్తున్నారు, దీని వలన ఇజ్రాయెల్ గాజా నుండి తన బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుని యుద్ధాన్ని శాశ్వతంగా ముగించాల్సి ఉంటుంది.
జనవరి 19న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందంలోని మొదటి ఆరు వారాల దశ శనివారం అర్ధరాత్రి అధికారికంగా ముగిసింది. అయితే, గాజాలో యుద్ధాన్ని ముగించడానికి ఒప్పందం రెండవ దశకు ముందుకు సాగడానికి ఇజ్రాయెల్ అంగీకరించలేదు.
మొదట మూడు దశల్లో ఒప్పందం కుదిరేందుకు వీలుగా ప్రణాళిక వేసుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఈ ఒప్పందం, రెండవ దశ చర్చలలో పాల్గొనడానికి నెతన్యాహు నిరాకరించడంతో నిలిచిపోయింది. ఈ దశలో అతను మరింత మంది ఇజ్రాయెల్ ఖైదీలను విడుదల చేయించేందుకు ప్రయత్నించాడు, అదే సమయంలో మారణహోమాన్ని ముగించడం, గాజా నుండి ఉపసంహరించుకోవడం వంటి కీలకమైన నిర్ణయాలనుండి పక్కకు తప్పించుకున్నాడు.