లక్నో-ఉత్తరప్రదేశ్: రానున్న శుక్రవారం హోలీ కావడంతో, ఈద్గాతో సహా లక్నోలో ప్రార్థన సమయాలను మధ్యాహ్నం 12 గంటలకు బదులుగా 2 గంటలకు మార్చారు.
ఈమేరకు ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా చైర్మన్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగి మహాలి ఈ నోటీసును విడుదల చేశారు, హోలీ వేడుకలు మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతాయి కాబట్టి,… ముస్లింలు 12:45 గంటలకు బదులుగా 2 గంటల తర్వాత నమాజ్ చేయడం మంచిదని ఆయన పేర్కొన్నారు.
ఇటీవలే సంభాల్ పోలీసు అధికారి మాట్లాడుతూ… ముస్లింలు హోలీ సమయంలో ఇంట్లోనే ఉండాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత శాంతి కమిటీ చర్చల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, సంభాల్‌లో ప్రాంతంలోని హిందువులు మధ్యాహ్నం 2:30 గంటల వరకు హోలీ జరుపుకుంటారు కాబట్టి, ఆ తర్వాత ముస్లింలు జుమా ప్రార్థనలు చేయాలని నిర్ణయించారు.
శాంతిభద్రతలను కాపాడటానికి, ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కాన్స్టాబులరీ (PAC) ఏడు కంపెనీలను మోహరించనున్నట్లు సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు.
ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకు ప్రార్థన సమయాలు మారవు. మౌలానా ముఫ్తీ షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ స్థానిక మసీదులు ఈ నిర్ణయాన్ని పాటించాలని, హోలీ సమయంలో ముస్లింలు బయటకు వెళ్లకుండా ఉండాలని కోరారు.