హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి, దుబ్బాక జిల్లాల్లో మార్చి 12న తెలంగాణ గృహ నిర్మాణ పథకం కింద లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు లేఖలను పంపిణీ చేయనుంది. డిగ్నిటీ హౌసింగ్ పథకం కింద నిర్మించిన 2BHK ఇళ్లను 794 మంది పురుషులు, 498 మంది మహిళలు కలిపి మొత్తం 1292 మంది లబ్ధిదారులు ఇళ్ల కేటాయింపు లేఖలను అందుకుంటారు. అంతేకాదు 177 మంది పురుషులు, 63 మంది మహిళలు సహా మొత్తం 240 మంది వ్యక్తులకు అద్దె గృహ ఒప్పందాలను అందిస్తారు.
ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచడం, నిరుపేదలకు సురక్షితమైనన గృహాలను అందించడం ఈ పథకం లక్ష్యం.
ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రతినిధుల సమక్షంలో గృహనిర్మాణ భవిష్యత్తు దశలపై చర్చలు కూడా ఈ కార్యక్రమంలో ఉంటాయి. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు ఇతర ప్రముఖులు హాజరవుతారు.
కాగా, లబ్దిదారుల జాబితాలో పేర్లు రాని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఒక నిరంతర ప్రక్రియ అని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందులో భాగంగా మరో విడతలో నిజమైన లబ్ధిదారులను అధికారులు గుర్తించి ఎంపిక చేస్తారని తెలిపారు.