హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే వారం ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఉష్ణోగ్రత 40°నుండి 44°కు చేరుకునే అవకాశం ఉంది. అయితే మార్చి 20, 24 మధ్య ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రజలకు అధిక వేడి నుండి కాస్త ఉపశమనం లభించనుంది.
హైదరాబాద్‌కు చెందిన వాతావరణ విశ్లేషకుడు టి బాలాజీ ప్రకారం… మార్చి 19 వరకు వడగాల్పులు కొనసాగుతాయి. ఆ తర్వాత ఉరుములతో కూడిన వర్షాల కారణంగా ఎండ వేడిమి నుండి తాత్కాలిక విరామం లభించే అవకాశం ఉంది.
వాతావరణ విష్లేకుడు బాలాజీ ట్వీట్
ఇక ప్రస్తుత వేడి, పొడి వాతావరణం హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నివాసితులను ప్రభావితం చేస్తోంది, చాలామంది తీవ్ర ఉష్ణోగ్రతలను తట్టుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని అన్నారు.
అంతేకాదు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో శరీరానికి నేరుగా ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. తెలంగాణ వేసవి నెలల్లోకి అడుగుపెడుతున్నందున, ఈ ఉరుములు తాత్కాలికంగా ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో సహాయపడతాయని వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు, కానీ త్వరలోనే వేడి తిరిగి వస్తుందని భావిస్తున్నారు.