కోల్కత పశ్చిమ బెంగాల్లో ఓ భూస్వామి నిర్మించిన గిదేశ్వర్ శివాలయం, గ్రామ కుల సోపానక్రమానికి ప్రతిరూపం. శతాబ్దాల క్రితం ఆ జమీందార్ 60 బిఘాల భూమిని ఈ ఆలయం కోసం దానం చేసాడు. వివిధ వర్గాలకు భూమితో పాటు విధులను కేటాయించారు. జమీందారు స్థాపించిన గిదేశ్వర్ శివాలయంలో బ్రాహ్మణులు ఆచారాలను చూసుకుంటారు, ఘోష్ సమాజం పాలను, మలకర్ సమాజం పువ్వులు సరఫరా చేస్తుంది, బయాన్లు సంగీతానికి బాధ్యత వహిస్తారు.
మరోవంక తరతరాలుగా ఆలయ భూమిలో నివసించే దాస్ సమాజం ఆలయ వేడుకల సమయంలో వాయిద్యాలు వాయించడం వంటి విధులను నిర్వర్తించింది. అయితే వారికి ఆలయ గర్భగుడిలోకి మాత్రం ప్రవేశం లేదు.
“మేము రోజువారీ కూలీ కార్మికులం. మేము ఆలయ భూమిలో కొంత భాగంలో నివసిస్తున్నాము. తరతరాలుగా మా విధి డ్రమ్స్ వాయించడం. అయినప్పటికీ, మాకు ఆలయంలోకి ప్రవేశం లేదు. బ్రాహ్మణులదే ఆధిపత్యం, కుల రాజకీయాల ద్వారా మమ్మల్ని విభజించారని ఆ సంఘంలోని గ్రామ పెద్ద భగీరథ్ దాస్ అన్నారు.
130 కుటుంబాలతో కూడిన దాస్ సంఘం ఇటీవల ఈ అంశంపై కోర్టు కెళ్లింది. తమకు ఆలయ ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేసింది. దీంతో బ్రాహ్మణ నేతృత్వంలోని ఆలయ కమిటీ నుండి ప్రతిఘటన ఎదురైంది. ఈ పరిణామం సామాజిక ఘర్షణకు దారితీసింది. జిల్లా అధికారులు జోక్యం తర్వాత, దాస్ సంఘం ప్రవేశ హక్కులను పొందింది, కానీ రోజుకు ఒక గంట మాత్రమే. వారు ఇప్పటికీ విగ్రహానికి అభిషేకం చేయలేరు.
“మూడు శతాబ్దాలుగా గర్భగుడిలోకి ప్రవేశం ప్రత్యేకంగా బ్రాహ్మణులకే ఉండేది. ఇతర కులాలు పూజారుల ద్వారా మాత్రమే దేవుడికి అభిషేకం చేసేవారు. ఇప్పుడు, దాస్ సమాజానికి ఉదయం 10 నుండి 11 గంటల మధ్య ప్రవేశానికి అనుమతించారు.
ఈ ఒక గంట సమయాన్ని అక్కడి స్థానికుడు ఆశాదాస్ పేదల విజయంగా చూస్తాడు. సమానత్వ ఉద్యమానికి నాయకత్వం వహించి గ్రామస్తులలో ఆయన ఒకరు. “లెఫ్ట్ ఫ్రంట్ పాలనలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి, కానీ గ్రామంలోని శక్తివంతమైన వర్గాలు ఈ సమస్యను అణిచివేశాయి. ఈసారి, రిజర్వేషన్ కోటా కింద మా కమ్యూనిటీ పంచాయతీలో ఆధిక్యం ఉంది. దీంతో మేము రాజకీయ ఒత్తిడిని ఉపయోగించి ఆలయంలో ప్రవేశించగలిగామని దాస్ అన్నారు.
అయితే ఈ పరిణామంతో ఉన్నత కులస్థులు ఖిన్నులయ్యారు. షెడ్యూల్డ్ కులానికి చెందిన దాస్ వర్గీయులకు రోజు వారీ కూలీ పని ఇవ్వడం లేదు. వారి వద్ద పాలు కొనడం ఆపేశారు.
రాజకీయ చర్చలో కులం కంటే వర్గాలక చారిత్రాత్మకంగా ప్రాధాన్యత ఇచ్చిన లోతుగా పాతుకుపోయిన భద్రలోక్ రాజకీయ సంస్కృతి కారణంగా పశ్చిమ బెంగాల్లో కుల వివక్ష ప్రధాన స్రవంతి రాజకీయ సమస్యగా మారలేదు. బెంగాల్ రాజకీయ ఆర్థిక వ్యవస్థ ఆధిపత్య కులాలు సామాజిక-ఆర్థిక శక్తిని కొనసాగిస్తూనే ఉన్నాయని నిర్ధారించింది.
“పశ్చిమ బెంగాల్లో కులతత్వం అనేది చాలా అరుదుగా వ్యక్తమవుతుంది. ఆ పంచాయితీలోని గిద్గ్రామ్ గ్రామానికి నలుగురు తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కానీ వారు నిరసనలపై మౌనం పాటించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ కూడా మాట్లాడలేదు.