ఫ్లోరిడా : యావత్ ప్రపంచాన్ని ఉత్కంఠతకు గురిచేసిన సునీతా విలియమ్స్ అంతరిక్షయానం విజయవంతంగా ముగిసింది. 286రోజులు అంతర్జాతీయ అంతరిక్షంలో చిక్కుకుపోయిన బారత సంతతి వ్యోమగామి భారత కాలమానం ప్రకారం ఈరోజు తెల్లవారుఝామున సురక్షితంగా భూమికి చేరుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కేవలం 8 రోజుల పాటు ఉండేందుకు వెళ్లిన ఆమెతో పాటు బుచ్ విల్మోర్ అనే మరో అస్ట్రోనాట్ …తిరిగి తీసుకు వచ్చే వ్యోమనౌక లో సమస్యలు ఏర్పడటంతో అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది.
THE MOMENT! Sunita Williams exits the Dragon capsule#sunitawilliamsreturn #SunitaWillams pic.twitter.com/sCsYw7MUgq
— JUST IN | World (@justinbroadcast) March 18, 2025
ఎట్టకేలకు నాసా వారిని తీసుకొచ్చేందుకు చేపట్టిన మిషన్ సఫలమైంది. నేటి తెల్లవారుజామున 3:27 గంటలకు స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ అనే వ్యోమనౌక లో వీరు సురక్షితంగా భూమి మీద అడుగుపెట్టారు. ఈ క్రూ డ్రాగన్ ఫ్లోరిడా తీర ప్రాంతంలోని సముద్ర జలాల్లో సేఫ్‌గా ల్యాండ్ అయింది. అనంతరం నాసా, అమెరికా నౌకాదళ సిబ్బంది కాప్సూల్ వద్దకు చేరుకుని దానిని వెలికి తీసి… అందులోని వ్యోమగాములను బయటకు తీసుకొచ్చారు. అనంతరం వీరిని హ్యూస్టన్‌లో జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. నాలుగు గంటల పాటు వైద్య పరీక్షలు జరుగుతాయి.
భూమికి సురక్షితంగా చేరుకున్న అనంతరం సునీతా విలియమ్స్ నవ్వుతూ అభివాదం చేశారు.వ్యోమనౌక సేఫ్ ల్యాండింగ్‌తో నాసా, స్పేస్-ఎక్స్‌లో సంబరాలు అంబరాన్నంటాయి.. 288రోజులపాటు విలియమ్స్, విల్మోర్ అంతరిక్షంలో ఉన్నారు. మూడో అంతరిక్ష యాత్రను సునీత విజయవంతంగా ముగించారు.
సునీత క్షేమంగా భూమిపైకి రావడంతో భారత్‌లోనూ సంబరాలు అంబరాన్నంటాయి.. గుజరాత్‌లో టపాసులు కాల్చి సునీత బంధువర్గం ఆనందం వ్యక్తంచేసింది. కాగా, ఎనిమిది రోజుల యాత్ర కోసం వెళ్లిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ సాంకేతిక కారణాల వల్ల దాదాపు తొమ్మది నెలల(286 రోజులు) పాటు ఐఎస్ఎస్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది.