హైదరాబాద్: తెలంగాణ SSC పబ్లిక్ పరీక్షలు మార్చి 21న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగుస్తాయి, రాష్ట్రవ్యాప్తంగా 2650 పరీక్షా కేంద్రాల్లో 5.09 లక్షలకు పైగా విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. ఈ పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతాయి. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు (ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:50 వరకు) సైన్స్ (భౌతిక, జీవ శాస్త్రంగా విభజించారు. ఇది ఉదయం 9:30 నుండి ఉదయం 11:00 వరకు జరుగుతుంది) మిగతా సబ్జెక్టులు యథావిధిగా జరుగుతాయి.
పరీక్షల నిర్వహణ కోసం..
పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులను, కస్టోడియన్లు, ఇన్విజిలేటర్లను నియమించారు. కేంద్రానికో ఇద్దరు ఏఎన్ఎంలు, ఒక పోలీసు అధికారి, ఇద్దరు అటెండర్లను నియమించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఉంటాయి. ఇందులో విద్యా, రెవెన్యూ, పోలీసు శాఖల నుంచి ఒక్కొక్కరు ఉంటారు. సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు ఉంటాయి. కలెక్టర్, అదనపు కలెక్టర్లు పరీక్ష సరళిని తనిఖీ చేస్తారు.
నిఘానేత్రం పర్యవేక్షణలోనే..
ప్రతి కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ ఉండే గదిలో నిఘానేత్రాలను పెట్టించారు. పరీక్ష సమయానికంటే 15 నిమిషాల ముందు నిఘానేత్రం పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాల కట్టలను తెరవాల్సి ఉంటుంది. సీసీ కెమెరాలు లేని కేంద్రాల్లో అమర్చుకోవాలని కేంద్రాల నిర్వాహకులకు ఉన్నతాధికారులకు చెప్పారు.
పరీక్షలను సజావుగా నిర్వహించడానికి అధికారులు పకడ్బందీ చర్యలు:
భద్రత & నిఘా: చీఫ్ సూపరింటెండెంట్ల కార్యాలయాల్లో CCTV కెమెరాలు ఏర్పాటు చేశారు. 144 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పరీక్షా కేంద్రాలను పర్యవేక్షిస్తాయి.
మొబైల్ ఫోన్ నిషేధం: విద్యార్థులు, అధికారులు పరీక్షా హాళ్లకు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావడాన్ని నిషేధించారు.
పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధింపు.
హాల్ టిక్కెట్లు: విద్యార్థులు తమ పాఠశాలల నుండి హాల్ టిక్కెట్లను తీసుకోవచ్చు లేదా అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కంట్రోల్ రూమ్ సపోర్ట్: ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్, జిల్లా కార్యాలయాలలో ఫిర్యాదుల పరిష్కారం కోసం 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది (ఫోన్: 040-23230942).
ట్రాఫిక్ లేదా వాతావరణ పరిస్థితుల కారణంగా చివరి నిమిషంలో జాప్యాలను నివారించడానికి విద్యార్థులు ఒకటి లేదా రెండు రోజులు ముందుగానే తమ పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష రోజు ఉదయం 8:30 గంటలకు చేరుకోవాలని అధికారులు కోరారు.