న్యూఢిల్లీ: భారతదేశానికి డబ్బు పంపడంలో గల్ఫ్ దేశాలు మిగతా వాటికన్నా ముందున్నాయని ఆర్బిఐ నివేదిక వెల్లడించింది. 2023 నుండి 2024 వరకు భారతదేశానికి వచ్చిన మొత్తం రెమిటెన్స్‌లలో 38% సౌదీ అరేబియా, ఖతార్ UAE, ఒమన్, బహ్రెయిన్ వంటి సభ్యదేశాలుగా ఉన్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) ద్వారానే జరుగుతుంది. విదేశీ చెల్లింపులు $18.7 బిలియన్లుగా ఉన్నాయి. ఈ మొత్తం 3,896.3 బిలియన్ భారతీయ రూపాయలకు సమానం.
గల్ఫ్ దేశాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE భారతదేశానికి డబ్బు పంపడంలో అగ్రస్థానంలో ఉంది. దీని అర్థం UAEలో నివసిస్తున్న NRIలు ఇతర గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న వలసదారుల కంటే తమ దేశానికి ఎక్కువ డబ్బు పంపుతారు. UAE కూడా భారతీయ వలస కార్మికులకు అతిపెద్ద కేంద్రం. ఈ వలస కార్మికులలో ఎక్కువ మంది నిర్మాణ పరిశ్రమలు, ఆరోగ్య సంరక్షణ, పర్యాటక రంగాలలో పనిచేస్తున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ డిపార్ట్మెంట్ ప్రచురించిన ‘ఛేంజింగ్ డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ రెమిటెన్సెస్’ రిపోర్ట్ ప్రకారం… దేశాల వారీగా రెమిటెన్స్‌లు, రాష్ట్రాల వారీగా రెమిటెన్స్‌ల సమాచారాన్ని అందిస్తుంది.
ప్రపంచంలోని మొత్తం భారతీయ వలసదారులలో సగం మంది గల్ఫ్ సహకార మండలి GCC దేశాల్లోనే పనిచేయడం గమనార్హం. 2048 నాటికి, భారతదేశంలో పనిచేసేవారి జనాభా పెరిగేకొద్దీ ప్రపంచంలోనే అతిపెద్ద కార్మిక సరఫరాదారుగా అవతరిస్తుందని కూడా ఆర్బీఐ నివేదిక పేర్కొంది.
అమెరికా, యుకె, సింగపూర్, కెనడా మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలు రెమిటెన్సులలో సగం వాటా కలిగి ఉన్నాయి. US, UK, సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు రెమిటెన్స్‌లలో మిగిలిన సగం వాటాను కలిగి ఉన్నాయి.
ఇక రాష్ట్రాల విషయాన్ని పరిశీలిస్తే… మహారాష్ట్ర, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల నుంచి విద్య, ఉపాధి అవకాశాల కోసం అత్యధిక సంఖ్యలో విద్యార్థులు విదేశాలకు వలస వెళ్తున్నారని నివేదిక వెల్లడించింది.