ముంబయి: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై కమెడియన్ కునాల్ కమ్రా చేసిన ‘దేశద్రోహి’ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో సేన కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఈ మేరకు స్టాండ్-అప్ కమెడియన్ కునాల్ కమ్రా ఉపయోగించిన “ది యూనికాంటినెంటల్ వేదికను శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. పార్టీ సభ్యులు ఖార్ పోలీస్ స్టేషన్‌లో కమెడియన్‌పై పిర్యాదు చేశారు.
ఉద్ధవ్ ఠాక్రే నుంచి కునాల్ కమ్రా డబ్బులు తీసుకున్నారని.. అందుకే ఏక్‌నాథ్ షిండేను టార్గెట్ చేస్తున్నారని లోక్‌సభ ఎంపీ నరేష్ మష్కే ఆరోపించారు. “కామ్రా ఒక కాంట్రాక్ట్ కమెడియన్. కానీ అతను పాము తోకను తొక్కకూడదు. కోరలు బయటకు వచ్చిన తర్వాత, భయంకరమైన పరిణామాలు ఉంటాయి” అని ఆయన అన్నారు. మహారాష్ట్రలోనే కాదు.. కునాల్ దేశంలో ఎక్కడా స్వేచ్ఛగా తిరగలేడని హెచ్చరించారు. శివసేన సైనికులు అతన్ని వెంటాడుతూనే ఉంటారని వార్నింగ్ ఇచ్చారు.
కాగా, శివసేన కార్యకర్తలు చేసిన విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలను శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. రాష్ట్రంలో ఒక బలహీనమైన హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఉన్నారని ఆరోపించారు.
‘దిల్ తో పాగల్ హై’ పాట ‘భోలీ సి సూరత్’ తరహాలో మహారాష్ట్ర రాజకీయాలకు సంగీత స్పర్శను ఇస్తూ, కామ్రా తన ప్రదర్శనలో శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండేను ఎగతాళి చేస్తూ ప్రేక్షకుల నుండి నవ్వులు పూయించాడు. “మేరీ నజర్ సే తుమ్ దేఖో తో గద్దర్ నాజర్ వో ఆయే. హాయే!” అతను తన ప్రదర్శనలో చెప్పాడు. అతను తన X హ్యాండిల్‌లో “పాట” వీడియో క్లిప్‌ను కూడా శివసేన నేత పోస్ట్ చేశాడు.
ఇది 2022లో అప్పటి ముఖ్యమంత్రి, అవిభక్త శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేపై శ్రీ షిండే చేసిన తిరుగుబాటుకు ఈ పాట పేరడీగా ఉంది. మరోవంక పోలీసులు కమ్రాపై కేసు నమోదు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో తమ క్లబ్‌ను మూసివేస్తున్నట్లు హాబిటాట్ స్టూడియో ప్రకటించింది.