గాజా : ఈద్ అల్-ఫితర్ పండుగ రోజున గాజాలో పిల్లలతో సహా కనీసం 64 మందిని ఇజ్రాయెల్ దళాలు చంపాయని పాలస్తీనా అధికారులు తెలిపారు. అదేసమయంలో తప్పిపోయిన 14 మంది వైద్యుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
దక్షిణ గాజాలోని రఫా సమీపంలో వైద్యుల వాహనాలు ఇజ్రాయెల్ కాల్పులకు గురైన వారం తర్వాత, పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీ (PRCS) ఎనిమిది మంది వైద్యులు, ఐదుగురు పౌర రక్షణ కార్మికులు, ఒక UN ఉద్యోగి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది.
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీస్ (IFRC) ఈ హత్యలను ఖండించింది, ఈ “వినాశకరమైన సంఘటన” 2017 నుండి ప్రపంచంలో ఎక్కడైనా తన కార్మికులపై జరిగిన అత్యంత ప్రాణాంతకమైన దాడిని సూచిస్తుందని పేర్కొంది.
గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంలో కనీసం 50,277 మంది పాలస్తీనియన్లు మరణించారని, 1,14,095 మంది గాయపడ్డారని తెలిపింది. గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం రెండు నెలల క్రితం మరణాల సంఖ్యను 61,700 మందికి పైగా ఉందని, శిథిలాల కింద తప్పిపోయిన వేలాది మంది మరణించినట్లు భావిస్తున్నారని పేర్కొంది.
హమాస్ నేతృత్వంలో 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో జరిగిన దాడుల్లో కనీసం 1,139 మంది మరణించారు, 200 మందిని బందీలుగా పట్టుకెళ్లారు.