పాట్నా : బీహార్ పోలీసులు నిన్న 32 మంది ముస్లిం పిల్లలను తలపై టోపీలు పెట్టుకున్నందుకు అదుపులోకి తీసుకున్నారు. ఈ పిల్లల వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయింది. వన్ ఇండియా హిందీ వార్తా సంస్థ ప్రకారం, జామియా జకారియా మదర్సాలో చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు పిల్లలను మోకామా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ పిల్లలు బీహార్‌లోని మైదాబభంగామా అనే గ్రామానికి చెందినవారు.
విద్యార్థులు టోపీలు పెట్టుకున్నందుకు గానూ పోలీసులు అరెస్టు చేశారని వన్ ఇండియా హిందీ వార్తా సంస్థ నివేదించింది. పిల్లలను ఉదయం 8 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారని, ఆ తరువాత వారందరినీ వారి వదిలేశారని ఆరోపణలు ఉన్నాయి. స్టేషన్‌లోని పోలీసు అధికారులు పిల్లలకు ఎలాంటి ఆహారం, నీరు కూడా అందించకపోవడం గమనార్హం.
ఈ వార్తకు సంబంధించి సియాసత్ వార్తా పత్రిక మోకామా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జిని సంప్రదించడానికి ప్రయత్నించినప్పుడు, అధికారి ఎటువంటి సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో లింక్