గాజా: పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో పాలస్తీనియన్లను వైమానిక బాంబులు, క్షతగాత్రుల అరుపులు, భయం, అదేపనిగా వెంటాడుతున్నాయి, ఇక్కడ మూడు వారాల క్రితం ఇజ్రాయెల్ దాడులు తిరిగి ప్రారంభించడంతో నిరాశ్రయులు సురక్షిత స్థలం కోసం అన్వేషణ మొదలెట్టారు.
ఇజ్రాయెల్ సైనికులు మమ్మల్ని” ఖాళీ చేయాలని అడుగుతున్నారు, కానీ మేము ఎక్కడికి వెళ్తాము?” అని ఉత్తరాన బాంబు దాడుల నుండి పారిపోయి అజ్-జావేదా మధ్య పట్టణంలో ఒక టెంట్‌లో నివసించడానికి వచ్చిన మహమూద్ హుస్సేన్ మీడియాను ప్రశ్నించారు. ఇజ్రాయెల్ సైన్యం ప్రచురించిన మ్యాప్‌లో ఒక్క ఏరియా కూడా సురక్షితంగా లేదని, దగ్గరలో ఉన్న అనేక సమీప ప్రాంతాలను జాబితా చేశారని ఇక నేనెక్కడి వెళ్లాలని ఆ వ్యక్తి వాపోయారు.
ఇజ్రాయెల్ సైన్యం దాడులు, భూ కార్యకలాపాలను పునరుద్ధరించినప్పటి నుండి, ఉత్తరం, దక్షిణం, గాజా స్ట్రిప్ మధ్యలో ఉన్న ప్రదేశాల్లో తలదాచుకుంటున్న ప్రజలు ఆ ప్రదేశాలను ఖాళీ చేయాలని ఆదేశాలను జారీ చేసింది, దాడులు చేస్తామని స్థానికులను హెచ్చరించింది.
మార్చి 18 నుండి దాదాపు నాలుగు లక్షల మంది గాజావాసులు నిరాశ్రయులయ్యారని UN తెలిపింది. గత ఆదివారం, సోమవారం రాత్రిపూట ఇజ్రాయెల్ దేర్ ఎల్-బాలాపై దాడి చేసిందని గాజా పౌర రక్షణ సంస్థ తెలిపింది. ఈ పరిస్థితుల్లో హుస్సేన్ తన తాత్కాలిక టెంట్ శిబిరంలోని ఇతరులతో కలిసి సమీపంలోని ఫీల్డ్ ఆసుపత్రికి పారిపోయాడు. మళ్లీ మంగళవారం ఉదయం నుంచి ఆ బృందం తమ వస్తువులను మళ్ళీ ప్యాక్ చేయడం ప్రారంభించింది, సురక్షిత ప్రాంతం కోసం మళ్లీ అన్వేషణ మొదలుపెట్టింది..
ఈమేరకు పెద్దలు తమ వద్ద మిగిలి ఉన్న కొన్ని వస్తువులతో చిరిగిన ప్లాస్టిక్ సంచులను నింపారు, పిల్లలు సమీపంలో తిరుగుతున్నారు. దుమ్ముతో నిండిన రోడ్డు వెంట గాడిద బండ్లు తిరుగుతున్నాయి, మహిళలు తమ తలలపై బుట్టలను మోస్తున్న దృశ్యాలు అక్కడ నిత్యకృత్యమయ్యాయి.
ఐక్యరాజ్యసమితి ప్రకారం, దాదాపు 2.4 మిలియన్ల మంది స్థానికులు తమ ఇళ్లనుండి పారిపోయారు, వారిలో చాలామందికి గాజాలో ఇది ఇప్పుడు సుపరిచితమైన దృశ్యం.
‘ఆశ లేదు’
మార్చి 18న ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై తీవ్ర దాడులను తిరిగి ప్రారంభించింది, హమాస్‌తో రెండు నెలల కాల్పుల విరమణను ముగించింది. సంధిని పునరుద్ధరించే ప్రయత్నాలు ఇప్పటివరకు విఫలమయ్యాయి.
హమాస్ ఆధీనంలో ఉన్న ప్రాంతంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ… ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలలో కనీసం 1,449 మంది పాలస్తీనియన్లు మరణించారని, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి మొత్తం మరణాల సంఖ్య 50,810కి చేరుకుందని తెలిపింది.
అధికారిక ఇజ్రాయెల్ గణాంకాల ఆధారంగా AFP లెక్క ప్రకారం, హమాస్ 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో యుద్ధం ప్రారంభమైంది, దీని ఫలితంగా అప్పట్లో 1,218 మంది ఇజ్రాయేలీలు మరణించారు.
కాగా, తాజాగా డీర్ ఎల్-బలాలో, రాత్రిపూట ఇజ్రాయెల్ వైమానిక దాడి ఒక ఇంటిని లక్ష్యంగా చేసుకుంది, ఐదుగురు పిల్లలు సహా తొమ్మిది మంది మరణించారని గాజా పౌర రక్షణ సంస్థ తెలిపింది. తదనంతరం, AFPTV ఫుటేజ్‌లో ఒక ఇంటి కూలిపోయిన రెండు అంతస్తుల మధ్య చిక్కుకున్న ప్లాస్టిక్ కుర్చీ, దుప్పట్లు, ప్రకాశవంతమైన ఎరుపు రంగు పిల్లల బాత్‌టబ్‌ను మనకు తాజా దృశ్యాల్లో కనిపిస్తోంది.
ఒక మృతదేహాన్ని బయటకు తీసుకురావడానికి పాలస్తీనియన్లు తీవ్రంగా శ్రమించారు, దానిని దుప్పటిలో మెట్లపైకి తీసుకెళ్లి ట్రక్కు వెనుక భాగంలో లోడ్ చేశారు.”మేము భయంతో పరుగెత్తాము, మొదట దాడి ఎక్కడ తగిలిందో కూడా తెలియక,” ఇంటి యజమాని బంధువు అబేద్ సబా అన్నారు.
మొత్తం 11 మృతదేహాలను బయటకు తీయగలిగామని సబా చెప్పారు, “వారిలో ఎక్కువ మంది పిల్లలు, మహిళలే కావడం గమనార్హం.” ఒక యువతి శిథిలాలు, లోహపు కడ్డీల మధ్యలో కూర్చుని ఉంది, దాని చుట్టూ టాయిలెట్ పేపర్ రోల్స్, దుప్పట్లు, దెబ్బతిన్న నురుగు పరుపు ఉంది.
సమీపంలోని అల్-అక్సా అమరవీరుల ఆసుపత్రిలో, తెల్లటి ప్లాస్టిక్ కవర్లలో మృతదేహాలు వచ్చాయి. బంధువులు నేలపై రక్తంతో తడిసిన మృతదేహ సంచులపై ఏడుస్తూ ప్రార్థనలు చేశారు. ఒక వృద్ధ మహిళ దుఃఖిస్తున్నవారి గుంపు గుండా వెళుతూ, ఏడుపు ఆపుకోలేక పోయింది.
“ఇల్లు నిరాశ్రయులైన వ్యక్తులు, పిల్లలతో నిండి ఉంది. నలుగురు పిల్లలు శిరచ్ఛేదం చేయబడ్డారు – వారి తప్పు ఏమిటి?” అని నదీన్ సబా ఏడుస్తూ అడిగింది. దాడి సమయంలో భవనంలో ఉన్నానని సబా పేర్కొంది.
“పొరుగువారి అరుపులు” విని మేల్కొన్న తర్వాత సోమవారం తాను డీర్ ఎల్-బాలా నుండి బయలుదేరానని 35 ఏళ్ల అమల్ జబ్బల్ చెప్పింది. “మొత్తం ప్రాంతాన్ని కుదిపేసిన” దాడి జరగడానికి ముందే తాను అక్కడి నుంచి వెళ్లిపోయానని ఆమె చెప్పింది. “విధ్వంసం భారీగా ఉంది, భయం ఇంకా ఎక్కువగా ఉంది,” అని ఆమె చెప్పింది.