హైదరాబాద్: యావద్దేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసత్వాన్ని స్మరించుకుంటున్న వేళ, తెలంగాణ పోలీసులు అనేక మంది దళితులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే…కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండల కేంద్రంలో ఈ సంఘటన జరిగింది, భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)కు చెందిన దళిత సభ్యులను పోలీసు వ్యాన్ లోకి నిర్దాక్షిణ్యంగా ఎత్తిపడేశారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారిన వీడియోలో, ఒక దళిత కార్మికుడు లోదుస్తులలో ఉండగా పోలీసులు అతన్ని ఈడ్చుకెళ్లడం కనిపించింది. లింగంపేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రాజు ఈ సంఘటనను ధృవీకరించారు. “కొంతమంది బిఆర్ఎస్ కార్యకర్తలు గులాబీ కండువాలు ధరించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. మండలంలో ఫ్లెక్సీలపై నిషేధం ఉంది. గ్రామ పంచాయతీ కార్యదర్శి దానిని అనుమతించకపోవడంతో, వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత బిఆర్ఎస్ కార్యకర్తలు అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు, ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం కలిగింది” అని పోలీసు అధికారి తెలిపారు.
గ్రామ పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని దళిత కార్మికులు తమ నిరసనను ముగించడానికి నిరాకరించడంతో, బలప్రయోగానికి దిగారు. “ముగ్గురు BRS అనుచరులు – రాపర్తి భూపతి, వంటరిపల్లి సాయిలు,ముదం సాయిలు – ముందస్తుగా అదుపులోకి తీసుకుని విడుదల చేశారు” అని కానిస్టేబుల్ చెప్పారు.
దళితుల దాడిపై స్పందించిన కేటీఆర్
BRS దళిత కార్యకర్తలు పోలీసుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది, దీంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KT రామారావు (KTR) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
బాబాసాహెబ్ జయంతి సందర్భంగా ఆయన ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం నేరమా అని సామాజిక మాథ్యమ Xలో ప్రశ్నించారు. “కాంగ్రెస్ పాలిత తెలంగాణలో బాబాసాహెబ్ జయంతి సందర్భంగా ఆయన నీడలోనే ఒక దళిత వ్యక్తిని వివస్త్రను చేసి అరెస్టు చేశారు! అంబేద్కర్ జయంతికి బ్యానర్ కట్టడం ఎంత దారుణమైన నేరమో చెప్పాలని కోరుతున్నాను” అని KTR పోస్ట్‌లో రాశారు.
వీడియో లింక్