కోల్‌కత : పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలోని బిధాన్ చంద్ర కృషి విశ్వవిద్యాలయ (BCKV) వ్యవసాయ విభాగం ప్రవేశ ద్వారం నోటీసు బోర్డులో అవమానకరమైన పోస్టర్ కనిపించింది. ఇది విద్యార్థులు, అధ్యాపకులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. BCKV భారతదేశంలోని ప్రముఖ వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో ఒకటి, ఇస్లామోఫోబిక్ సందేశం కనిపించడం క్యాంపస్ కమ్యూనిటీని తీవ్రంగా కలవరపెట్టింది.
చేతితో రాసిన పోస్టర్‌లో ఇలా ఉంది: “కుక్కలు, ముస్లింలకు అనుమతి లేదు. అందరి దృష్టి పహల్గామ్‌పైనే ఉంది. ఉగ్రవాదం అంటే ఇస్లాం.” ఈ పోస్టర్‌పై ఎవరి పేరు లేదు. దీన్ని గమనించిన వెంటనే తొలగించారు. స్వతంత్ర మీడియా సంస్థ మక్తూబ్ పోస్టర్ ప్రామాణికతను ధృవీకరించింది. దాని ఫోటోను సేకరించింది.
పోస్టర్‌ను ఉంచినందుకు ఏ వ్యక్తి లేదా సమూహం బాధ్యత వహించలేదు. విశ్వవిద్యాలయ పాలకమండలి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత దేశవ్యాప్తంగా ఇస్లామోఫోబిక్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. ఈ దాడిలో 26 మంది మరణించారు కాగా వీరిలో ఇద్దరు విదేశీయులు, ఒక స్థానిక యువకుడు సైతం మరణించారు.
కాశ్మీర్‌లో చురుకుగా పనిచేస్తున్న సాయుధ సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి బాధ్యత వహించింది. ఈ బృందానికి పాకిస్తాన్ మద్దతు ఇచ్చిందని భారత ప్రభుత్వం ఆరోపించింది, ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతుంది.
పోస్టర్‌లో “అన్ని కళ్ళు పహల్గామ్‌పైనే” అనే ప్రస్తావన జాతీయ విషాదాన్ని మతపరమైన ద్వేషం, విభజనకు ఆజ్యం పోసేందుకు ఉపయోగించుకుంటున్నట్లు కనిపిస్తోంది. భారతదేశంలోని ముస్లిం వర్గాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉగ్రవాద సంఘటనలను ఉపయోగించుకునే విస్తృత ధోరణిలో భాగంగా చాలామంది దీనిని భావిస్తున్నారు.
బిధాన్ చంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (BCKV) లోని విద్యార్థులు, అధ్యాపకులు ఈ పోస్టర్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు, క్యాంపస్‌లో మత సామరస్యాన్ని కాపాడేందుకు బలమైన చర్యలు తీసుకోవాలని పలువురు పిలుపునిచ్చారు. “ఇది నిజంగా దురదృష్టకరం, ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు” అని ఒక ప్రొఫెసర్ అన్నారు. “విద్యాపరమైన నైపుణ్యం, సమగ్రతకు పేరుగాంచిన సంస్థలో ఇటువంటి ద్వేషపూరిత కంటెంట్‌కు స్థానం లేదని” ఆయన చెప్పారు.