చండీగఢ్ : పహల్గామ్ ఉగ్ర దాడిలో భర్తను కోల్పోయిన నేవీ ఆఫీసర్ భార్య హిమాన్షి ముస్లింలపై కీలక వ్యాఖ్యలు చేశారు. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ జయంతి సందర్భంగా, శాంతి, ఐక్యత కోసం ఆయన భార్య హృదయపూర్వక విజ్ఞప్తి చేశారు. ఆయన జ్ఞాపకార్థం నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆమె మాట్లాడుతూ… ఈ విషాదం తర్వాత ముస్లింలను, కాశ్మీరీలను నిందించవద్దని ఆమె దేశ ప్రజలను కోరారు. “మనం ముస్లింలను లేదా కాశ్మీరీలను లక్ష్యంగా చేసుకోకూడదు. మాకు శాంతి కావాలి,” న్యాయం కావాలి. ద్వేషం, విభజనకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.
This is a slap to Right Wing hatemongers by Himanshi, wife of Indian Navy Lieutenant Vinay Narwal, who was killed in the Pahalgam terror attack. "We don't want people going against Muslims or Kashmiris. We want peace and only peace. Of course, we want justice," pic.twitter.com/Q7awrLPLwZ
— Mohammed Zubair (@zoo_bear) May 1, 2025
భారతీయ నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఏప్రిల్ 22న హిమాన్షితో హనీమూన్‌లో ఉండగా హత్యకు గురయ్యారు. ఈ జంట ఆరు రోజుల క్రితమే, ఏప్రిల్ 16న వివాహం చేసుకున్నారు. వీసా సమస్యల కారణంగా స్విట్జర్లాండ్‌ను సందర్శించాలనే వారి అసలు ప్రణాళిక విఫలమైంది, బదులుగా వారు జమ్మూ-కాశ్మీర్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ నిర్ణయం వారి జీవితంలో విషాదం నింపింది.
వైరల్ అయిన వీడియోలో హిమాన్షి దాడి జరిగిన భయంకరమైన క్షణం గురించి వివరించింది. “నేను నా భర్తతో కలిసి భేల్ పూరీ తింటున్నాను. ఒక వ్యక్తి వచ్చి నా భర్తను నీవు ముస్లింవా అని అడిగాడు. నా భర్త కాదు అని చెప్పడంతో వ్యక్తి వెంటనే నా భర్తను కాల్చి చంపాడు” అని కన్నీళ్లతో చెప్పిన వీడియో వైరల్ గా మారింది.
తన భర్త నిర్జీవ శరీరం పక్కన కూర్చున్న హిమాన్షి చిత్రం దేశ వాసులకు వెంటాడే గుర్తుగా మారింది. అయినప్పటికీ, దుఃఖంలో కూడా, ఆమె న్యాయం కోసం పిలుపునిచ్చింది – ప్రతీకారం కాదు – దాడి చేసిన వారిని శిక్షించాలని అధికారులను కోరింది, పహల్గామ్ ఉగ్రదాడి కోపాన్ని ఏ సామాజికవర్గాన్ని కూడా టార్గెట్ చేయడం తనకు ఇష్టం లేదన్నారు.
వినయ్ నర్వాల్‌కు నిన్నటికి 27 ఏళ్లు నిండాయి. అతని జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం నిర్వహించారు. హిమాన్షి ప్రార్థనలు బలాన్ని కోరింది. ఆమె ధైర్యాన్ని సోషల్ మీడియాలో చాలామంది ప్రశంసించారు, కోపం కంటే కరుణను ఎంచుకున్నందుకు అభినందించారు.
రచయిత్రి ఫర్జానా వెర్సే మాట్లాడుతూ.. “మీ స్వంత గాయాన్ని పక్కనపెట్టి, గొప్ప పని కోసం మాట్లాడటానికి అపారమైన ధైర్యం అవసరం… శాంతి మాత్రమే సరైన ఎంపిక అని హిమాన్షి అర్థం చేసుకున్నారని ఆమె అన్నారు.”