హైదరాబాద్ : వేసవి సీజన్ వస్తే చాలు అందరి దృష్టి మామిడి పండ్ల వైపే.. ఫలోకా రాజా మామిడిలో అనేక రకాలున్నాయి. రంగురంగుల మామిడి పండ్లు.. రకరకాల సైజులతో ఆహారప్రియులను ఆకరిస్తూ ఉంటాయి. తొలి లా టొమాటినా ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన తర్వాత… ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైదరాబాద్ మ్యాంగో మేళాకు రంగం సిద్ధమైంది. ఈ మేళాలో వందకు పైగా రకాలతో మామిడి పండ్లు కనువిందు చేయనున్నాయి.
ఈ కార్యక్రమాన్ని జో చాహే మ్యాంగో ఫెస్టివల్ పేరిట నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి అంతా పండ్లలో రాజు మామిడి గురించే అంతా చర్చించుకుంటున్నారు. ఈ కార్యక్రమం నగరాన్ని మామిడిమయంగా మార్చనుంది. ఈ మేళాలో భాగంగా కొత్త, కొత్త మామిడి ఆవిష్కరణలు, వర్క్‌షాప్‌లు, ఉల్లాసమైన సంగీతం వరకు ప్రతిదీ మనల్ని అలరించేందుకు సిద్దమవుతోంది.
‘థింగ్స్ టూ డు’ ద్వారా నగరానికి వచ్చిన ఈ ఉత్సవం ఇప్పటికే ముంబై, పూణే, బెంగళూరులలో సందడి చేసింది. ఈ మెట్రో నగరాల్లో… మామిడి పండ్ల తీపి, వగరు, పులుపు ఆనందాన్ని జరుపుకోవడానికి వేలాది మంది జనాలు తరలివచ్చారు. ఇప్పుడు, హైదరాబాద్ పసుపు రంగులోకి మారడమే తరువాయి వంతుగా మిగిలింది. ఎందుకంటే ఈ కార్యక్రమం ఆహార ప్రియులు, కుటుంబాలు, మామిడిని ఇష్టపడే వారికి ఒక అద్భుతమైన అనుభూతిని ఇవ్వడానికి రెడీ అంటోంది.
మామిడి పండుగలో ఏమి ఆశించాలి?
జో చాహే మామిడి పండుగ కేవలం మామిడి పండ్లను తినడం గురించి కాదు, వాటిని అత్యంత సరదాగా, రుచిగా, ఇంటరాక్టివ్‌గా అనుభవించడం ముఖ్యం. మీ మామిడి అభిరుచిలో మునిగిపోవడానికి 50+ ఫ్యూజన్ వంటకాలను సిద్ధం చేయనున్నారు.
అంతేకాదు జో చాహే మామిడి ఉత్సవంలో తినే పోటీలు, లైవ్ మ్యూజిక్, కూల్ సమ్మర్ వర్క్‌షాప్‌లు, ఇంటరాక్టివ్ గేమ్‌లు, పిల్లలు, పెద్దల కోసం ప్రత్యేక జోన్‌లు కూడా ఉంటాయి. కొన్ని విచిత్రమైన ఫోటో బూత్‌లు, మామిడి నేపథ్య అలంకరణలతో మీ కోసం సిద్ధంగా ఉండనున్నాయి.
బిర్యానీకి పండుగ స్ఫూర్తికి ప్రపంచ చిరునామాగా మారిన హైదరాబాద్, మామిడిపై ఉన్న పిచ్చి ప్రేమను ఆవిష్కరించడానికి సరైన స్టాప్‌గా మారనుంది. ఈ ఉత్సవం హైదరాబాదీలు వేసవి పండ్ల చుట్టూ కేంద్రీకృతమై నోస్టాల్జియా. అంతేకాదు సంస్కృతి, సృజనాత్మకతకు వేదికగా మారనుంది.
మీరు మామిడి ఔత్సాహికులైతే, తోటి మామిడి ప్రియులను కూడా కలవాలనుకుంటే, బుక్ మై షో ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని… జో చాహే మామిడి ఉత్సవ వేదిక అయిన ఇనార్బిట్ మాల్‌కు మే 23 సాయంత్రం నాలుగు గంటలకు విచ్చేయండి. ఈ మ్యాంగో మేళాకు ప్రతి ఒక్కరికి ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారన్న సంగతి మరిచిపోవద్దు.