Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

బీహార్ ఓటర్ల జాబితా సవరణ…ఈసీతో సమావేశంపై నిరాశ వ్యక్తం చేసిన ఇండియా కూటమి!

Share It:

న్యూఢిల్లీ: బీహార్‌లో ఇటీవల ప్రకటించిన “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్” (SIR) ఎన్నికల జాబితాకు వ్యతిరేకంగా నిన్న సాయంత్రం ఇండియా కూటమి ప్రతినిధి బృందం ఎన్నికల సంఘాన్ని (EC) కలిసింది – ఈ సమావేశం”నిరాశపరిచింది”, “స్నేహపూర్వకంగా లేదు” అని నేతలు పేర్కొన్నారు.

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు SIRను ప్రారంభించాలనే EC చర్యను ఇండియా కూటమి వ్యతిరేకించింది. దాని సాధ్యాసాధ్యాల గురించి ప్రశ్నలను లేవనెత్తింది, దీని కోసం కమిషన్ బీహార్‌లో 7.75 కోట్ల మంది అర్హతగల ఓటర్లను ధృవీకరించాల్సి ఉంటుంది, అదే సమయంలో దాని సామర్థ్యంపై సందేహాలను వ్యక్తం చేస్తుంది.

తమను తాము అర్హులైన ఓటర్లుగా నిరూపించుకునే బాధ్యతను ప్రజలపై ఉంచే ఈ కసరత్తు” సామూహిక ఓటుహక్కు తొలగింపు”కు దారితీస్తుందని కొందరు నాయకులు ఆరోపించారు, ముఖ్యంగా బీహార్ వంటి అభివృద్ధి చెందని రాష్ట్రంలో వారి జనన ధృవీకరణ పత్రాలను, వారి తల్లిదండ్రుల సర్టిఫికేట్‌లను అందించడం పెద్ద ఇబ్బందికరంగా మారనుంది.

ఆధార్ లేదా రేషన్ కార్డులు వంటి సాధారణ గుర్తింపు కార్డులు SIRలో సరిపోవని, ప్రజలు తమ “జన్మస్థలాలను” నిరూపించుకోవడానికి వారి తల్లిదండ్రుల జనన ధృవీకరణ పత్రాలను కూడా చూపించాల్సి ఉంటుందని EC పేర్కొంది. ఇలా అయితే రాష్ట్రం వెలుపల నివసించే వలస కార్మికులలో ఎక్కువ మందిని మినహాయించే అవకాశం కూడా ఉందని ఇండియా కూటమి నేతలు అనుమానం వ్యక్తం చేశారు.

బుధవారం సాయంత్రం సమావేశం ముగిసిన వెంటనే, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి పత్రికలకు వివరించారు. ప్రతినిధి బృందం ECకి మూడు విషయాలను గుర్తుచేసిందని ఆయన అన్నారు.

ఒకటి, 2003 తర్వాత SIR కలిగి ఉండటం వెనుక ఉన్న తర్కాన్ని అది ప్రశ్నించింది, ఆ తర్వాత బీహార్‌లో “నాలుగు లేదా ఐదు” ఎన్నికలు జరిగాయి.”అవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయా?” అని కాంగ్రెస్ ఎంపీ ప్రశ్నించారు.

రెండు, EC నిర్ణయం ప్రకటించిన తొందరపాటుపై ప్రతినిధి బృందం తన ఆందోళనను వ్యక్తం చేసిందని కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి అన్నారు.

“ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? [ఒక] SIR అవసరం ఉంటే, అది జనవరి-ఫిబ్రవరిలో జరిగి ఉండేది. మీరు దీని కోసం ఒక నెల సమయం ఇచ్చారు. 7.75 కోట్ల మంది ఓటర్ల గణనకు ఒక నెల సమయం ఏమేరకు సరిపోతుందని కాంగ్రెస్‌ నేత డిమాండ్‌ చేసారు.

“ఏది చేయవలసి వచ్చినా – ఏవైనా సవాళ్లు ఉన్నా – దానికి రెండు-మూడు నెలలు ఉన్నాయి. ఇది సరిపోదు” అని సింఘ్వి అన్నారు.

మూడవదిగా, గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి జనన ధృవీకరణ పత్రాలు అందుబాటులో లేకపోవడంపై ప్రతినిధి బృందం ఆందోళన వ్యక్తం చేసిందని, ఆధార్ లేదా రేషన్ కార్డులు ఎందుకు అంగీకరించరని సింగ్వి అడిగారు.

“మొదటిసారిగా, జనన ధృవీకరణ పత్రం లేకపోతే ఒక వ్యక్తి పేరు పరిగణించమని మీరు చెబుతున్నారు. ఒక వర్గంలో, మీరు 1987- 2012 మధ్య జన్మించినట్లయితే తల్లిదండ్రుల జనన ధృవీకరణ పత్రాలు కూడా అవసరం. బీహార్‌లో చాలా మంది [పేదలు, మైనారిటీ, వెనుకబడిన వర్గాల వారు] ఉన్నారని మేము చెప్పాము. వారు పత్రాల కోసం పరిగెడుతూనే ఉంటారా? ఇది ప్రజాస్వామ్యంలో సమానత్వానికి విరుద్ధమని” ఆయన అన్నారు.

11 పార్టీల నుండి ఇరవై మంది నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు, అయితే తృణమూల్ కాంగ్రెస్ నుండి ఎవరూ అందుబాటులో లేరు.

కమిషన్ కార్యాలయాన్ని సందర్శించిన నాయకులందరినీ సమావేశానికి హాజరు కావడానికి ఈసీ అనుమతించలేదని సింఘ్వి అన్నారు. కమిషన్ మొదట పార్టీ ముఖ్యులను మాత్రమే కలవడానికి అంగీకరించిందని, కానీ ఒత్తిడి కారణంగా ప్రతి పార్టీ నుండి ఇద్దరు నాయకులను దాని కార్యాలయం లోపల అనుమతించిందని ఆయన అన్నారు.

“కొంతమంది బయట వేచి ఉండాల్సి వచ్చింది. “ఈ విషయంపై మేము ఫిర్యాదు చేసాము, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపించాము,” అని సింఘ్వి అన్నారు.

సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో నాయకులు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలను కలిశారని తెలుస్తోంది.

ఈ ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ నాయకులు జైరామ్ రమేష్, అభిషేక్ మను సింఘ్వి, పవన్ ఖేరా, పార్టీ బీహార్ చీఫ్ రాజేష్ రామ్; బీహార్ నాయకుడు అఖిలేష్ ప్రసాద్ సింగ్; రాష్ట్రీయ జనతాదళ్ ఎంపీ మనోజ్ కుమార్ ఝా; సమాజ్‌వాదీ పార్టీ హరేందర్ మాలిక్; నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) ఫౌజియా ఖాన్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) జాన్ బ్రిట్టాస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్‌కు చెందిన దీపాంకర్ భట్టాచార్య, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి డి. రాజా ఉన్నారు.

Tags :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.