వాషింగ్టన్: డోనాల్డ్ ట్రంప్ కలల బిల్లుపై ఎలోన్ మస్క్ మండిపడ్డాడు. దీనిని ‘పిచ్చి’, ‘విధ్వంసకరం’ అని అభివర్ణించాడు. ఈ బిల్లు ‘ఉద్యోగాలను నాశనం చేస్తుంది’ మరియు ‘యునైటెడ్ స్టేట్స్ వ్యూహానికి హాని కలిగిస్తుంది’ అని మస్క్ పేర్కొన్నాడు. మస్క్, ట్రంప్ మధ్య జరిగిన బహిరంగ వివాదం తర్వాత బిల్లు ఆమోదం పొందటం గమనార్హం. మొత్తంగా టెక్ దిగ్గజం, అమెరికా అధ్యక్షుడి మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత పరిశీలకులను అయోమయంలో పడేస్తోంది.
కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్…బిల్లును సెనేట్ ఆమోదిస్తే…. మరుసటి రోజే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానంటూ ఇటీవలే హెచ్చరించారు. అమెరికాకు ఇప్పుడు రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీలకు ప్రత్యామ్నాయ పార్టీ కావాలని….. సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రజాగళం వినిపించేందుకు…మరో పార్టీ అవసరమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన చట్టసభ సభ్యులపై……. విమర్శలు చేశారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తామని ప్రచారం చేసి.. ఇప్పుడు బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు మద్దతుగా ఓటు వేసేవారు వచ్చే ఏడాది జరిగే ప్రైమరీ ఎన్నికల్లో… తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు ఒక పోస్టర్ ను… తన పోస్టుకు జత చేశారు.
అమెరికా రుణపరిమితిని 5 ట్రిలియన్ డాలర్లు పెంచేందుకు ఓటేశాను అని…. ఆ పోస్టర్ లో ఉంది. వెనక పెద్ద అక్షరాలతో అసత్యవాది అని రాసి ఉంది. బిల్లుకు ఓటు వేసినవారు..పోస్టర్‌లో ఉన్న ముఖాన్ని తమదిగా ఉహించుకోవాలని ఎలాన్ మస్క్ సూచించిన విషయం తెలిసిందే.
మరోవంక బిగ్ బ్యూటిఫుల్ బిల్లు కారణంగా అమెరికాలో పన్ను మినహాయింపు పరిమితిని 10,000 డాలర్ల నుంచి 40,000 డాలర్లకు పెంచారు. ఈ కొత్త మినహాయింపులు తదుపరి 10 సంవత్సరాల్లో ఫెడరల్ బడ్జెట్ లోటును 3.4 ట్రిలియన్ డాలర్ల వరకు పెంచే అవకాశం ఉంది. ఫుడ్ స్టాంప్ పథకంలో మార్పులు చేశారు. కొత్త బిల్లు ద్వారా రాష్ట్రాలు కూడా ఈ పథకానికి సంబంధించిన వ్యయాన్ని పంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 2017లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమలు చేసిన పన్ను తగ్గింపును ఈ బిల్లు ద్వారా శాశ్వతంగా అమలు చేయనున్నారు.