న్యూఢిల్లీ: ఆటో రంగానికి, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలకు కీలకమైన అరుదైన భూ ఖనిజ ఎగుమతులపై చైనా పరిమితి విధించడం మనకు ఒక మేల్కొలుపు. ఈ పరిస్థితుల్లో మనదేశ పారిశ్రామిక ఆవసరాలకు వాడే కీలకమైన పదార్థాల దేశీయ అన్వేషణ, ఉత్పత్తిని వేగవంతం చేయడానికి భారతదేశం అత్యవసరంగా చర్య తీసుకోవాలి.
పరిశ్రమ ఎగుమతిదారుల ప్రకారం…భారత ఆటో రంగం చైనాలో దొరికే అరుదైన భూ ఖనిజాలపై ఎక్కువగా ఆధారపడటం వలన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
ప్రపంచంలో మూడవ అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన భారత్‌కు ఈ పరిస్థితి అతిపెద్ద ప్రమాదాలలో ఒకటి. మారుతి సుజుకి, బజాజ్ ఆటో వంటి స్థానిక కార్ల తయారీ కంపెనీలు ఇప్పటికే తమ సరఫరాను తగ్గించాయి. ఎందుకంటే ఈ కంపెనీల ఈవీ వాహనాలతో పాటు ఎగుమతి అయ్యే కార్ మోడళ్లలో చాలా వరకు చైనా నుంచి వచ్చే అయస్కాంత మూలకాలపై ఆధారపడ్డాయి. దీని పరిష్కారానికి సియామ్, ఆటోమోటివ్ కాంపోనెంట్ తయారీదారుల సంఘం (ఏసీఎంఏ) వంటి పరిశ్రమ సంఘాలు లైసెన్సులను వేగవంతం చేయడానికి చైనాకు ప్రతినిధి బృందాన్ని పంపేందుకు సిద్ధమవుతున్నాయి.
కాగా దీనిపై సీఐఐ అధ్యక్షుడు మాట్లాడుతూ…”పరిస్థితి ఇప్పటివరకు వచ్చిన దానికంటే చాలా తీవ్రమైనదని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ చీఫ్ రాజీవ్ మెమాని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన అధిక సుంకాలకు ప్రతిస్పందనగా చైనా ఏప్రిల్ నుండి అరుదైన భూమి అయస్కాంతాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. అరుదైన ఎర్త్ మాగ్నెట్ల ప్రపంచ ప్రాసెసింగ్ సామర్థ్యంలో 90 శాతానికి పైగా చైనా నియంత్రణలో ఉంది, ఇవి ఆటోమొబైల్స్‌కు మాత్రమే కాకుండా క్లీన్ ఎనర్జీ, గృహోపకరణాలకు కూడా కీలకమైనవి.
మేవ్ ఎర్త్ మాగ్నెట్ కొరత సమస్యను పరిష్కరించకపోతే ఆగస్టు నుండి అనేక ఆటో తయారీదారులు ఉత్పత్తి అంతరాయాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SLAM), ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ACMA) ప్రభుత్వ జోక్యం కోసం పిలుపునిచ్చాయి.
ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి భారత అధికారులు తమ చైనా సహచరులతో సంప్రదింపులు జరుపుతున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల తెలిపింది. కాగా, ప్రస్తుత సంక్షోభం చైనా ఆధిపత్య ప్రపంచ సరఫరా గొలుసుపై భారతదేశం ఆధారపడటాన్ని తగ్గించడానికి ఒక మేల్కొలుపు పిలుపుగా పనిచేస్తుందని సీఐఐ అధ్యక్షుడు మెమాని నొక్కి చెప్పారు.