ముంబయి: మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలో తన కూతురికి ఫీజు వాపసు ఇవ్వాలని డిమాండ్ చేసిన 42 ఏళ్ల రైతును పాఠశాల యాజమాన్యం కొట్టి చంపినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.
గురువారం సాయంత్రం పూర్ణలోని జీరో ఫాటా ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని ఒక అధికారి తెలిపారు. రైతు జగన్నాథ్ హెంగ్డేపై రెసిడెన్షియల్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ హెడ్, అతని భార్య దాడి చేశారు.
హెంగ్డే తన కుమార్తె ఫీజు వాపసు ఇవ్వాలని, ఆమె టీసీ కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాఠశాల యాజమాన్యం హెడ్, అతని భార్య హెంగ్డేతో తీవ్ర వాగ్వాదానికి దిగారని ఆయన అన్నారు.
“వారు హెంగ్డేపై దాడి చేయడం వల్ల మరణించాడు. దీంతో పోలీసులు పాఠశాల యాజమాన్యం హెడ్, రాజకీయ పార్టీతో అనుబంధం ఉన్న అతని భార్యపై కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది” అని పూర్ణ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.