అహ్మదాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (CAA) కింద, 185 మంది పాకిస్తాన్ సంతతికి చెందిన హిందువులకు భారత పౌరసత్వం మంజూరు చేశారు. ఈ వ్యక్తులకు కొత్త జీవితం ప్రారంభమైందని హోం వ్యవహారాల రాష్ట్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ వ్యక్తులు హిందువులతో పాటు కొంతమంది సిక్కులు, బౌద్ధులు పాకిస్తాన్లో హింస నుండి తప్పించుకున్న తర్వాత వారు గుజరాత్లోని రాజ్కోట్, కచ్ మరియు మోర్బి జిల్లాల్లో నివసిస్తున్నట్లు సమాచారం.
హోం వ్యవహారాల రాష్ట్ర మంత్రి హర్ష్ సంఘ్వీ వారి ధైర్యాన్ని ప్రశంసించారు. “మీరు ఇప్పుడు భారతీయ పౌరులు” అని చెప్పడంతో, గ్రహీతలు “భారత్ మాతా కీ జై” అని నినాదాలు చేశారు.
వివాదాస్పద CAA 2019లో ఆమోదించారు. కానీ మార్చి 2025 నుంచి అమలు చేస్తున్నారు. ఈ చట్టం డిసెంబర్ 31, 2014కి ముందు భారతదేశానికి చేరుకున్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుండి ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేస్తుంది.
అటువంటి పౌరసత్వం మంజూరు చేసిన రాష్ట్రాలలో గుజరాత్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. అస్సాంలో, ఇద్దరికి మాత్రమే పౌరసత్వం లభించింది.
ఇతర దేశాలలో హిందువులు హింసకు గురవుతున్నారని పేర్కొంటూ,“ఇటువంటి హింసలపై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు?” అని సంఘ్వీ ప్రశ్నించారు.