జెరూసలేం: ఇటీవల హమాస్ వీడియోలో కృశించిపోయినట్లు కనిపించిన వ్యక్తితో సహా గాజాలో ఉన్న మిగతా ఇజ్రాయెల్ బందీల తల్లులు ఇజ్రాయెల్ దాడి కారణంగా తమ కుమారుల ప్రాణాలకు మరింత ప్రమాదం కలుగుతుందని భయపడుతున్నారు.
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌తో దాదాపు రెండు సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధంలో గాజా నగరాన్ని ఆక్రమించుకునేందుకు కొత్త దాడిని ప్లాన్ చేస్తోంది. మరోవంక కాల్పుల విరమణను కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
“మా ప్రభుత్వం గాజాలో యుద్ధాన్ని పొడిగించాలని భావించడం విని, ఒక తల్లిగా నేను భయపడుతున్నాను. ఎందుకంటే మా సైన్యం వారికి దగ్గరగా వచ్చినప్పుడల్లా బందీలను చంపమని హమాస్ ఆదేశాలు ఇస్తుందని మాకు తెలుసు. అక్టోబర్ 7, 2023న జరిగిన సరిహద్దు దాడుల సమయంలో హమాస్ చేతిలో బందీగా ఉన్న ఇజ్రాయెల్ సైనికుడు నిమ్రోడ్ కోహెన్ తల్లి వికీ కోహెన్ అన్నారు.
జెనీవాలో ఉన్న కోహెన్, ఇతర బందీల తల్లులతో కలిసి వారికి సహాయం కోసం అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీకి విజ్ఞప్తి చేస్తూ, వారి విడుదల కోసం ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని పిలుపునిచ్చారు. “బందీలను అక్కడి నుండి బయటకు తీసుకురావడానికి మనం ప్రతిదీ చేయాలి” అని ఆమె చెప్పింది.
ఈ నెలలో హమాస్ వీడియోలో అస్థిపంజరంలా కనిపించిన ఎవ్యతార్ డేవిడ్ తల్లి గాలియా డేవిడ్, దాడికి ముందు తాను “నిజంగా భయపడుతున్నానని” చెప్పింది.
“విడుదలైన బందీల గాథలు దుర్బరంగా ఉన్నాయని, యుద్ధం జరిగినప్పుడు వారు బందీలతో మరింత కఠినంగా ప్రవర్తిస్తున్నారని మాకు తెలుసు” అని ఆమె విలేకరులతో అన్నారు. తన కుమారుడు కొన్ని రోజుల్లో ఆకలితో చనిపోతాడనే ఆందోళన కూడా ఉందని కోహెన్ తల్లి చెప్పారు.
మరోవంక మానవతా సాయంపై ఇజ్రాయెల్ ఆంక్షలతో గాజాలో పోషకాహార లోపం, ఆకలి సంబంధిత మరణాలు పెరుగుతున్నాయని మానవతా సంఘాలు చెబుతున్నాయి. కాగా, గాజాలో ఆకలికి తాను కారణం కాదని ఇజ్రాయెల్ సాకులు చెబుతోంది. హమాస్ సహాయాన్ని దొంగిలించిందని ఆరోపిస్తుంది, దీనిని హమాస్ ఖండిస్తుంది.
హమాస్ బంధించిన 251 మంది బందీలలో, దాదాపు 50 మంది బందీలు గాజాలోనే ఉన్నారు, వీరిలో దాదాపు 20 మంది ఇప్పటికీ బతికే ఉన్నారని భావిస్తున్నారు. బందీలు, వారిని బంధించిన వారితో సహా గాజాలోని మొత్తం జనాభాను ఇజ్రాయెల్ ఆకలితో అలమటింప జేస్తోందని ఇజ్రాయెల్ పేర్కొంది.