గాజా: పాలస్తీనా జర్నలిస్ట్ మర్వా ముసల్లం, ఆమె తమ్ముళ్ల అస్థిపంజరాలు ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో శిథిలాల కింద సజీవ సమాది అయిన కొన్ని వారాల తర్వాత వెలికితీసారు. 45 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత, ఆగస్టు 18న వారి అవశేషాలను వెలికితీశారు.
జూలై 5న, ఇజ్రాయెల్ దళాలు వారి పొరుగు ప్రాంతాలపై దాడి చేసినప్పుడు, మార్వా ముసల్లం తన సోదరులతో కలిసి ఇంట్లో ఉంది. వారి ఇల్లు నేలమట్టమై, ముగ్గురినీ సజీవంగా సమాధి చేసింది.
అల్ జజీరా జర్నలిస్ట్ మొహమ్మద్ అల్-సయదాలి ప్రకారం…మర్వా ముసల్లం శిథిలాల కింద తాను బతికే ఉన్నానని సంకేతాలు ఇవ్వగలిగారు, కానీ రెస్క్యూ ఆపరేషన్ మేము చేయలేకపోయాం. “ఆమె కొన్ని రోజులు బతికే ఉంది. ఆమెను రక్షించమని మేము ఐక్యరాజ్యసమితి, రెడ్ క్రాస్‌కు అనేక విజ్ఞప్తులు చేసాము, కానీ ఏమీ జరగలేదు” అని ఆయన అన్నారు.
గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుండి, 270 మందికి పైగా పాలస్తీనా జర్నలిస్టులు మరణించారు. ఇటీవలి హత్యలలో అల్ జజీరా జర్నలిస్ట్ అనాస్ అల్ షరీఫ్ కూడా ఉన్నారు. అతని మరణం ప్రపంచవ్యాప్తంగా సమాజం నుండి తీవ్ర ఖండనకు దారితీసింది. “మేము నిజం మాట్లాడటం వలన జర్నలిస్టులను చంపుతున్నారు” అని సయదాలి అన్నారు.
మరోవంక ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వం వహించిన కొత్త కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్ అంగీకరించింది.
ఈ ప్రతిపాదనలో 60 రోజుల విరామం ఉండనుంది. ఈ సమయంలో కనీసం 10 మంది ఇజ్రాయెల్ బందీలు, అనేక మృతదేహాల అవశేషాలు విడుదల చేస్తామని పాలస్తీనా అధికారులు AFPకి తెలిపారు. రెండవ దశలో మిగిలిన బందీలను విడుదల చేస్తామన్నారు.