హైదరాబాద్: చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (సీఐవో) ఆధ్వర్యంలో నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా ‘మట్టిలో చేతులు-మనసులో దేశం’ కార్యక్రమం ముగింపు సమావేశం ఛత్తాబజార్ లోని ఆ సంస్థ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.
ఈ ముగింపు సభకు జమాఅతె ఇస్లామీహింద్ సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ ముబష్షిర్ అధ్యక్షత వహించారు. పచ్చదనం పెరిగితేనే ప్రాణవాయువు పెరుగుతుందని, పచ్చని భవిష్యత్తు కోసం ప్రతిజ్ఞ చేద్దాం అని చిన్నారులు పిలుపునిచ్చారు.
ఈ ఉద్యమంలో భాగంగా నగరవ్యాప్తంగా చిన్నారులు 2వేల మొక్కలు నాటామని అన్నారు. ఈ ఉద్యమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం చిన్నారులకు పలు పోటీలు నిర్వహించారు. మన పిల్లలు నిర్మలమైన ఆకాశం క్రింద ఆడుకునేలా, ఆరోగ్యకరమైన వాతావరణంలో అభివృద్ధి చెందేలా మనం కలిసి ఒక శుభ్రమైన భవిష్యత్తును నిర్మించుదామని జేఐహెచ్ నగర అధ్యక్షులు పిలుపునిచ్చారు. విజేతలకు డాక్టర్ ముబష్షిర్ చేతుల మీదుగా బహుమతులు అందించారు.