టెల్అవీవ్: గాజా ఆక్రమణకు ఇజ్రాయెల్ ప్రధాని ప్రణాళిక వేస్తున్న విషయం తెలిసిందే. కొత్తగా మొదలెట్టే దాడి కారణంగా బందీగా ఉన్న తన కొడుకు మరణిస్తే నెతన్యాహుపై విచారణ జరపాలని కోరతానని ఓ తల్లి ప్రతిజ్ఞ చేసింది.
నెతన్యాహు గాజా స్ట్రిప్‌ను ఆక్రమించాలని ఎంచుకుంటే, అది బందీలను, ప్రియమైన సైనికులను ఉరితీయడం అవుతుంది” అని బందీగా ఉన్న మతన్ జాంగౌకర్ తల్లి ఐనవ్ జాంగౌకర్ అన్నారు.
ఈ నెల ప్రారంభంలో, పాలస్తీనా భూభాగంలో కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందానికి హమాస్అంగీకరించింది, కానీ ఇజ్రాయెల్ ఇంకా అధికారిక ప్రతిస్పందన ఇవ్వలేదు.
“నెతన్యాహు… నాకొడుకు శవపేటికలో తిరిగి వస్తే, దానికి ఇజ్రాయెల్ ప్రధానిగా నీవు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మీపై ముందస్తు హత్య కేసు నమోదు చేస్తానని టెల్ అవీవ్‌లో జరిగిన ర్యాలీలో ఆమె పేర్కొంది. బందీలను సురక్షితంగా తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
2023 అక్టోబర్‌లో హమాస్ దాడి చేసినప్పుడు, మతన్ జాంగౌకర్, అతనిస్నేహితురాలు ఇలానా గ్రిట్జ్యూస్కీతో కలిసి కిబ్బట్జ్ నిర్ ఓజ్‌లోని తన ఇంటి నుండి అపహరణకు గురయ్యారు.
దాదాపు 23 నెలల పోరాటంలో మొదటిసారి కాల్పుల విరమణ సమయంలో, గ్రిట్జ్యూస్కీ నవంబర్ 2023లో విడుదలయ్యాడు. అప్పటి నుండి బందీగా ఉన్న మతన్ జాంగౌకర్ తల్లి ఐనావ్ జాంగౌకర్ బందీలను సురక్షితంగా విడుదల చేసే ప్రచారంలో కీలక వ్యక్తిగా మారారు.