Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఇండోర్‌ ఆసుపత్రి ఐసీయూలో నవజాత శిశువుపై ఎలుకల దాడి…ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం!

Share It:

ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని మహారాజా యశ్వంతరావు ఆసుపత్రిలో ఇద్దరు నవజాత శిశువులను ఎలుకలు కొరికాయి. ఈ ఇద్దరు శిశువులలో ఒక బాలిక మంగళవారం న్యుమోనియాతో మరణించిందని ఒక అధికారి తెలిపారు.

ఎలుకల దాడి సంఘటన తర్వాత, ఆసుపత్రి ఇద్దరు నర్సింగ్ సిబ్బందిని సస్పెండ్ చేసి, నర్సింగ్ సూపరింటెండెంట్‌ను ఆ పదవి నుండి తొలగించింది. అలాగే, ఆసుపత్రి ప్రాంగణాన్ని శుభ్రం చేసే పనిలో ఉన్న ఒక ప్రైవేట్ సంస్థకు రూ. లక్ష జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు.

నవజాత శిశువుల శస్త్రచికిత్సకు సంబంధించిన విభాగంలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో ఒక బిడ్డ వేళ్లను ఎలుకలు కరిచాయి, అదే సమయంలో గత 48 గంటల్లో అవి మరొక బిడ్డ తల, భుజాన్ని కొరికాయని అధికారులు గతంలో తెలిపారు. ఈ సంఘటనపై ఆసుపత్రి దర్యాప్తుకు ఆదేశించింది.

ఎలుకల దాడిలో నవజాత శిశువు మరణించిన తర్వాత, ఆసుపత్రి యాజమాన్యంపై ప్రశ్నలు తలెత్తాయి, కానీ MYH పరిపాలన ఆ బాలిక వివిధ పుట్టుకతో వచ్చే వైకల్యాలతో బాధపడుతుందని, ‘న్యుమోనియా ఇన్ఫెక్షన్’తో మరణించిందని పేర్కొంది.

MYH రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రులలో ఒకటిగా పరిగణింణిస్తారు. ఈ ఆసుపత్రి ఇండోర్‌లోని ప్రభుత్వ మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉంది.

ఈ క్రమంలో కళాశాల డీన్ డాక్టర్ అరవింద్ ఘంగోరియా PTIతో మాట్లాడుతూ…ఎలుక కాటుకు గురైన ఇద్దరు నవజాత శిశువులలో ఒకరు మరణించారని చెప్పారు. అయితే మరణానికి పుట్టుకతో వచ్చే లోపాలు కూడా కారణమని, గుర్తు తెలియని బాలికను ఖార్గోన్ జిల్లాలో వదిలేస్తే ఆమెను గుర్తించి చికిత్స కోసం MYHకి పంపారని ఆయన అన్నారు.

“కేవలం 1.20 కిలోల బరువున్న నవజాత శిశువు ఇప్పటికే పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లో ఉంచారు” అని ఘంగోరియా చెప్పారు. ఆమె వయస్సు దాదాపు 10 రోజులు ఉన్నట్లు ఆయన చెప్పారు.

డీన్ ప్రకారం, బాలిక ప్రేగులు, ఊపిరితిత్తులు పూర్తిగా ఏర్పడలేదు. ఆమె హిమోగ్లోబిన్ స్థాయి కూడా సాధారణ స్థాయి కంటే చాలా తక్కువగా ఉంది. “ఆ బాలికకు చికిత్స చేస్తున్న వైద్యులు చెప్పిన దాని ప్రకారం, ఆమె న్యుమోనియా ఇన్ఫెక్షన్ తో మరణించింది. అయితే, మేము ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపాము, దీని వల్ల విషయాలు స్పష్టంగా తెలుస్తాయి” అని ఆయన అన్నారు.

ఎలుకల దాడికి గురైన మరో నవజాత శిశువు కూడా వివిధ పుట్టుకతో వచ్చే వైకల్యాల కారణంగా క్లిష్టమైన స్థితిలో MYHలో చేరాడు, అయితే అతని పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని ఆస్పత్రి డీన్‌ ఘంఘోరియా తెలిపారు..

భారీ వర్షాలు కురిసిన రెండు-నాలుగు రోజుల నుండి MYHలో ఎలుకలు కనిపిస్తున్నాయని, అంతకు ముందు కూడా ఎలుకలు కనిపించాయని డీన్ పేర్కొన్నారు.

అయితే, MYHలో నవజాత శిశువులపై ఎలుకలు దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. 2021లో, ఈ ప్రభుత్వ ఆసుపత్రిలోని నర్సరీలో (నవజాత శిశువులను సంరక్షణ కోసం ఉంచే ప్రదేశం) ఎలుకలు ఒక బిడ్డ మడమను కొరికాయి.

తాజా సంఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని న్యాయ విచారణకు డిమాండ్ చేసింది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి నీలభ్ శుక్లా మాట్లాడుతూ…“MYHలో ఇద్దరు నవజాత శిశువుల మృతదేహాలను ఎలుకలు కొరికి చంపిన కేసు పరిపాలనా నిర్లక్ష్యం మాత్రమే కాదు, ఇది భయంకరమైన సంఘటన. ఈ సంఘటనపై న్యాయ విచారణ జరగాలి. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.”

”ఈ సంఘటన తల్లిదండ్రుల హృదయాలను భయం, అభద్రతతో నింపింది. రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రిలో కూడా నవజాత శిశువులను సురక్షితంగా ఉంచలేకపోతే, సాధారణ ప్రజల భద్రతను ఆశించడం వ్యర్థం.”

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.