ఇంఫాల్: మణిపూర్‌లోని నాగా తెగలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ నాగా కౌన్సిల్ (UNC), స్వేచ్ఛా ఉద్యమ పాలన (FMR)ను ముగించి, 1,643-కి.మీ. భారతదేశం-మయన్మార్ సరిహద్దు వెంబడి కంచె నిర్మించాలనే కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా “వాణిజ్య నిషేధం” ప్రారంభించింది.
రోడ్డు దిగ్బంధనం ఎటువంటి వాణిజ్య వస్తువులను దాటనివ్వదని UNC తెలిపింది. 2వనంబర్, 37వ నంబర్ జాతీయ రహదారుల వెంబడి నాగా ఆధిపత్య ప్రాంతాలలో నిరసనకారులు ట్రక్కులను అడ్డుకున్నారు.
ప్రభావిత ప్రాంతాలలో సేనాపతి, ఉఖ్రుల్,టామెంగ్‌లాంగ్ ఉన్నాయి. దిగ్బంధనం కారణంగా మణిపూర్‌లోని సెంట్రల్ లోయ, దక్షిణ కుకి ఆధిపత్య ప్రాంతాలలోని కొండలు సహా ఇతర ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం కలిగింది.
ఆగస్టు 26న హోం మంత్రిత్వ శాఖతో జరిగిన సమావేశం విఫలమైందని, అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ కేంద్రం తమ ఆందోళనలకు స్పందించకపోవడం పట్ల UNC అసంతృప్తి వ్యక్తం చేసింది.
సరిహద్దు కంచె, FMR తొలగింపు చర్యలు.. మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మయన్మార్‌లోని నాగా తెగలను విభజించి, వారి సాంస్కృతిక గుర్తింపు, పూర్వీకుల సంబంధాలను తెంపేస్తుందని UNC తెలిపింది.
సరిహద్దు కంచె ప్రాజెక్టుకు రూ. 31,000 కోట్లు ఖర్చు
నాగా ఆధిపత్య ప్రాంతాలలో సరిహద్దు కంచెను నిలిపివేయాలని, FMR పునరుద్ధరించాలని, నాగా శాంతి ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వాలని UNC పేర్కొంది. NSCN(IM) చాలా కాలంగా కేంద్రంతో చర్చలు జరుపుతోంది. నిషేధాన్ని శాంతియుత నిరసనగా పేర్కొంటూ, UNC మణిపూర్ అంతటా నాగా వర్గాల మద్దతు కోరింది. ప్రజల అవగాహన కోసం అభ్యర్థించింది.
వారి డిమాండ్లను విస్మరిస్తే తమ నిరసనను తీవ్రతరం చేస్తామని UNC తెలిపింది. దిగ్బంధనం కారణంగా ఇంఫాల్ లోయలో ఆహార పదార్ధాల కొరత గురించి ఆందోళనలను లేవనెత్తింది. కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం మణిపూర్‌లో పర్యటించే అవకాశం ఉంది.