హైదరాబాద్: బంజారా హిల్స్ లోని హోటల్ తాజ్ కృష్ణ లో .ఈ రోజు అనగా 17.9.2025 న తీన్మార్ మల్లన్న తనపార్టీ పేరును తెలంగాణా రాజ్యాధికార పార్టీ అనే నామకరణం ప్రకటించారు . గతకొంతకాలంగా అంటే తెలంగాణ ఉద్యమంనుండి నేటి వరకూ అటు తెలంగాణ ఉద్యమంలో తనదైనశైలిలో పాటలతో మాటలతో ప్రజలను చైతన్య పరిచి ఆ తరువాత తన చానెల్ ద్వారా, mlc గాను ప్రజాసమస్యలపై గొంతెత్తడమే కాకుండా చాలా సాంఘీక రాజకీయ కార్యక్రమాలలో పాల్గొని ప్రజలకు చేరువై ప్రజల నోట్లో నాలుకై ఎదిగి నేడు బీసీ ,sc st మైనారిటీ వర్గాల సంక్షేమానికి అగ్రవర్ణాల రాజ్యాధికారం కాదు ఓటరు నాయకుడవ్వాలి అని తన పార్టీ పేరు తెలంగాణా రాజ్యాధికార పార్టీగా పేరును, జెండాను ఎజెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి అనేక మంది రాజకీయ అతిరధ మహారధులు ,పార్టీ కార్యకర్తలు సంఘీభావం తెలుపడానికి అనేకమంది ఈ కార్యక్రమం లో పాల్గొని మద్దతు తెలిపారు . తీన్మార్ మల్లన్న తన జర్నలిజం కెరీర్ను వి6 న్యూస్ ఛానల్లో ‘తీన్మార్ న్యూస్’ అనే సెటైరికల్ ప్రోగ్రామ్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల మధ్య విపరీతమైన ఆదరణ పొందింది. తన ప్రత్యేకమైన ప్రదర్శన శైలి, గ్రామీణ భాషా శైలి, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధానం ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. 2025 తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కులగణన సర్వే నివేదికపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ నివేదికను కాల్చివేత చేశారు, రెడ్డి వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు, తద్వారా కాంగ్రెస్ పార్టీ ఆయనపై చర్యలు తీసుకుంది 2025 జూలై 13న, తెలంగాణ జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన భద్రతా సిబ్బంది గాలిలో కాల్పులు జరిపారు. మల్లన్న ఈ దాడికి మంత్రి కవితను కారణంగా చూపించారు.
ఏదేమైనా ప్రజా సమస్యలపై ప్రజలకు అండదండగా ఉంటే అన్ని వర్గాలను కలుపుకుని ముందుకెళితే తప్పకుండా ప్రజలు ఆదరిస్తారని ఆశిద్దాం. ఇంత గ్రాండ్గా ఆవిర్భవించిన ఈ పార్టీ ప్రజా మన్ననలను పొందుతుందా లేక గతంలో బీసీల పేరుతో పార్టీలు పెట్టి కనుమరుగైపోయిన కొన్ని పార్టీల మాదిరిగా ఇది కూడా అవుతుందా అనేది వారి నిబద్ధత పైనే ఆధారపడి ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు .
ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామి హింద్ తెలంగాణా ఉపాధ్యక్షులు అబ్దుల్ మజీద్ షోయబ్, రాష్ట్ర మీడియా విభాగ అద్యక్షులు జయీముద్దీన్ అహ్మద్ కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపారు .