హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నగరంలో హైదరాబాద్‌లో నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. అల్పపీడనం కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగర రోడ్లు చెరువులుగా మారాయి. ముఖ్యంగా యూసుఫ్‌గూడలోని అనేక కాలనీలను వరదనీరు ముంచెత్తింది. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో ట్రాఫిక్ అంతరాయాలు సంభవించాయి. దీనివల్ల ప్రయాణికులకు ఇక్కట్లు తప్పలేదు.
జనజీవనం స్తంభించిపోయింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, సికింద్రాబాద్, ఎల్బీనగర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోఠి, మొజంజాహీ మార్కెట్ పరిసరాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్ మహా నగరంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సిటీ వ్యాప్తంగా 48 గంటల పాటు వర్షం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. గరంలో వరదలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్… హై అలర్ట్‌లో ఉండాలని ఆదేశించారు. అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని భారత వాతావరణ శాఖ అధికారులు ప్రజల్ని హెచ్చరించారు.