హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 783 ఖాళీలలో 782 ఖాళీలను భర్తీ చేసింది. ఈ గ్రూప్-2 నోటిఫికేషన్ ప్రక్రియ 2022లోనే ప్రారంభమైంది. పరీక్షలు గత ఏడాది డిసెంబర్ 15, 16 తేదీలలో నాలుగు సెషన్లలో జరిగాయి. ఈ సంవత్సరం జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల చేసారు. ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల ధృవీకరణ తర్వాత, తుది హాల్ టికెట్ నంబర్లను ఆదివారం కమిషన్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు.
18 పోస్ట్ కోడ్‌లలో ఖాళీలు భర్తీ చేశారు. అయితే కోర్టుల ముందు పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్, రిట్ అప్పీల్ కేసులలో ఆదేశాల ఫలితానికి లోబడి ఉంటాయి. అంతేకాదు అభ్యర్థి అవసరమైన పత్రాలు లేదా వాస్తవాలను వెల్లడించడంలో విఫలమైతే అభ్యర్థుల ఎంపిక కూడా రద్దు చేయనున్నారు.
గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర పరిపాలనలో కీలకంగా పనిచేసే డిప్యూటీ తహసీల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II, ఇతర విభాగాల్లో ఉన్నత హోదాలో ఉన్న అధికార పోస్టులు భర్తీ కానున్నాయి.
ఈ పరీక్షల్లో మల్టీజోన్-1కు చెందిన నారు వెంకట హరవర్ధన్ రెడ్డి 447.088 మార్కులతో టాపర్గా నిలిచాయి. ఈయన సాధారణ పరిపాలన విభాగం-జీఏడీలో ఏఎస్‌ఓగా ఎంపికయ్యారు.
ఈ పోస్టుల ఎంపికలో పురుషుల్లో టాప్-5 అభ్యర్థుల్లో మొదటి ర్యాంకర్ మినహా మిగతా వారంతా సబ్ రిజిస్ట్రార్ పోస్టులు ఎంపిక చేసుకున్నారు. మహిళల్లో టాప్-5లో నలుగురు నాయబ్ తహసీల్దార్లుగా పోస్టులు సాధించారు. ఈ పరీక్ష ఫలితాలు గ్రూప్-1 ఇచ్చిన తర్వాతే గ్రూప్-2 ఫలితాలు వెలువరించాలన్న ఉద్దేశంతో కొంత ఆలస్యమయ్యాయి. అయినప్పకీ రాతపరీక్షలు నిర్వహించిన సంవత్సరంలోగా తుది నియామకాలు పూర్తి చేశామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ బుర్రా వెంకటేశం పేర్కొన్నారు.
ట్యా