Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

బీహార్‌లో తుది ఓటర్ల జాబితా విడుదల…7.42 కోట్లకు తగ్గిన ఓటర్లు!

Share It:

న్యూఢిల్లీ: బీహార్‌లో తుది ఓటర్ల జాబితా ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు లెక్క తేలారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రారంభించాక 47 లక్షలకు పైగా తగ్గింది. అయితే, తుది జాబితాలోని ఓటర్ల సంఖ్య డ్రాఫ్ట్ రోల్ (7.24 కోట్లు) కంటే ఎక్కువగా ఉంది, ఆగస్టులో 65 లక్షల మంది ఓటర్ల పేర్లు “గైర్హాజరు”, “మార్పు” లేదా “చనిపోయిన”ట్లు తేలిన తర్వాత బయటకు వచ్చాయి.

బీహార్ ప్రధాన ఎన్నికల అధికారి జారీ చేసిన ప్రకటన ప్రకారం… ఆగస్టు 1న ముసాయిదా రోల్ ప్రచురించినప్పటి నుండి ముసాయిదా రోల్‌లో లేని 21.53 లక్షల “అర్హత కలిగిన ఓటర్ల” పేర్లను జోడించారు.అయితే, ముసాయిదా రోల్‌లో ఉన్న 3.66 లక్షల మంది ఓటర్ల పేర్లను “క్లెయిమ్‌లు, అభ్యంతరాలు” దశలో తొలగించారు.

తుది జాబితా ప్రచురించే సమయానికి ముసాయిదా జాబితాలో ఓటర్లను ఏ కారణంగా అనర్హులుగా గుర్తించారో ఎన్నికల సంఘం పేర్కొనలేదు. జిల్లా వారీగా పురుషులు, స్త్రీలు, జెండర్‌ ఓటర్ల సంఖ్య, వివిధ వయసుల నిష్పత్తి వంటి ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అంతకుముందు ఎన్నికల ప్రధానాధికారి ఒక సోషల్ మీడియా పోస్ట్‌ను విడుదల చేశారు. దీనిని ECకి కూడా ట్యాగ్ చేశారు. “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వెలుగులో, తుది ఓటర్ల జాబితాను 30.09.2025న ప్రచురించారు. voters.eci.gov.in లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ప్రజలు తమ పేర్లను చూసుకోవచ్చు” అని ప్రకటించారు.

ఇదిలా ఉండగా, పాట్నా జిల్లా యంత్రాంగం ఒక ప్రకటన విడుదల చేస్తూ, దాని పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం ఓటర్ల సంఖ్య దాదాపు 48.15 లక్షలు అని ప్రకటించింది, ఇది ఆగస్టు 1న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాతో పోలిస్తే “1.63 లక్షల పెరుగుదల” కనిపించింది. జిల్లాలో మొత్తం మహిళా ఓటర్ల సంఖ్య 22.75 లక్షలు, దిఘా నియోజకవర్గంలో అత్యధికంగా 4.56 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

ఈ ప్రకటనపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్-యునైటెడ్ ప్రతినిధి నీరజ్ కుమార్ స్పందిస్తూ… “రాహుల్ గాంధీ – తేజస్వి యాదవ్ నేతృత్వంలోని అవినీతి ప్రతిపక్షం ఓట్ల దొంగతనం ప్రచారం ఇప్పుడు బయటపడింది” అని అన్నారు.

“తుది ఓటర్ల జాబితాలో లక్షలాది కొత్త పేర్లు చేర్చారు. రాష్ట్రంలోని మెజారిటీ ఓటర్లు అణగారిన కులాలు లేదా మతపరమైన మైనారిటీలకు చెందినవారని అందరికీ తెలుసు” అని ఆయన ఎత్తి చూపారు.

అయితే, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ కుమార్, తుది జాబితాలో “చేర్పుల సంఖ్య కంటే ” ముసాయిదా జాబితాలో తొలగింపుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంపై “తీవ్ర ఆందోళనలు” వ్యక్తం చేశారు. “SIRకి సంబంధించిన సమస్యలు ఇంకా ముగియలేదు. మేము చివరి వరకు పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. EC విశ్వసనీయత, నిష్పాక్షికత సందేహాస్పదంగానే ఉంది” అని కాంగ్రెస్ నాయకుడు ఆరోపించారు.

రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉంది. అదేసమయంలో EC దేశవ్యాప్తంగా చేపట్టాలని భావిస్తున్న భారీ SIR కసరత్తు వివాదాన్ని రేకెత్తించింది. ప్రతిపక్ష పార్టీలు కొన్ని సుప్రీంకోర్టును ఆశ్రయించాయి, అధికార BJP నేతృత్వంలోని NDAకి ఓటు వేసే అవకాశం తక్కువగా ఉన్న ఓటర్ల పేర్లను తప్పుగా తొలగించడమే SIR లక్ష్యం అని ఆరోపించాయి.

అయితే, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా బిజెపి నాయకులు, ఇండియా కూటమిఓటు హక్కులు ఇవ్వాలని కోరుకునే “చొరబాటుదారులను” తొలగించడానికి SIR అవసరమని నొక్కి చెప్పారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.