టెల్ అవీవ్: గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లాలో పాల్గొన్న కార్యకర్తలను ఇజ్రాయెల్ అధికారులు చట్టవిరుద్ధంగా నిర్బంధించారని ఇజ్రాయెల్‌లోని లీగల్ సెంటర్ ఫర్ అరబ్ మైనారిటీ రైట్స్, అదాలా ఆరోపించింది. గాజా స్ట్రిప్‌కు మానవతా సహాయం అందించడానికి ప్రయత్నిస్తుండగా వీరిని అంతర్జాతీయ జలాల్లో అడ్డగించారు.
అష్డోడ్ పోర్టులో వందలాది మంది ఫ్లోటిల్లా కార్యకర్తలను అదాలా న్యాయవాదులు కలిశారని, అక్కడ వారు చట్టపరమైన సాయం లేకుండా అవమానకరమైన చికిత్సకు గురయ్యారని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటనలో చెప్పారు.
“వారిని జిప్-టైడ్ చేసి, గంటల తరబడి మోకరిల్లేలా బలవంతం చేసి, ఉగ్రవాదులుగా తప్పుడు ముద్ర వేశారు. అంతర్జాతీయ జలాల్లో అడ్డగించడం అపహరణకు సమానం, దిగ్బంధనం చట్టవిరుద్ధం” అని అదాలా అన్నారు.
ఖైదీలను తరువాత నెగెవ్ డిటెన్షన్ సెంటర్ (కెట్జియోట్ జైలు)కి బదిలీ చేశారని, అక్కడ ట్రిబ్యునల్ విచారణలు వారి న్యాయవాదులకు తెలియజేయకుండానే ప్రారంభమయ్యాయని సంస్థ తెలిపింది. ఖైదీల హక్కులను కాపాడటానికి మరియు పాల్గొన్న వారందరికీ జవాబుదారీతనం ఉండేలా చూసుకోవడానికి తమ న్యాయ బృందం ఇప్పుడు అక్కడికి చేరుకుందని ధృవీకరించింది.
ఫ్లోటిల్లా కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని, జప్తు చేసిన మానవతా సహాయాన్ని తిరిగి ఇవ్వాలని, జైలు పరిస్థితులను పర్యవేక్షించడానికి, ఇజ్రాయెల్‌ను జవాబుదారీగా ఉంచడానికి తక్షణ అంతర్జాతీయ జోక్యం చేసుకోవాలని అదాలా డిమాండ్ చేశారు.
ఫ్లోటి-రైట్ ఇజ్రాయెల్ మంత్రి ఇటామర్ బెన్-గ్విర్ కెట్జియోట్ జైలు లోపల ఫ్లోటిల్లాలో పాల్గొన్నవారి నిర్బంధం గురించి తాను గొప్పగా చెప్పుకుంటున్న వీడియోను పోస్ట్ చేయడం ద్వారా ఉద్రిక్తతలను మరింత పెంచాడు. “నేను వాగ్దానం చేసినట్లుగా, ఉగ్రవాదాన్ని సమర్ధించే మహిళలు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ వీరి ఆటలు సాగవు; వారిని ఉగ్రవాదుల మాదిరిగానే చూస్తామని ఆయన ప్రకటించారు.
ఖైదీలలోని పార్లమెంటేరియన్లు, జర్నలిస్టులను పాలస్తీనా ఖైదీలుగా పరిగణిస్తారని నొక్కి చెప్పారు. హక్కుల సంఘాలు దీనిని ఉద్దేశపూర్వక అవమానంగా పేర్కొన్నాయి.
పాలస్తీనియన్ ఖైదీలపై నెగెవ్ జైలులో విస్తృతమైన దుర్వినియోగాల రికార్డు ఉందని పాలస్తీనియన్ ఖైదీల క్లబ్ తెలిపింది. గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అనేక మంది ఖైదీలు దెబ్బలకు తట్టుకోలేక అక్కడ మరణించారని సబా న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
ఫ్లోటిల్లాపై దాడి అక్టోబర్ 1 బుధవారం రాత్రి జరిగింది, ఆ సమయంలో ఇజ్రాయెల్ నావికా దళాలు పలు నౌకలను స్వాధీనం చేసుకుని 40 కి పైగా దేశాల నుండి 450 మందికి పైగా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నాయి. గాజాపై దిగ్బంధనను విచ్ఛిన్నం చేయడానికి GSF అతిపెద్ద నావికా సహాయ మిషన్ చేపట్టింది. అయితే దాని అడ్డగింపును ప్రపంచవ్యాప్తంగా ఖండించారు. ప్రధాన నగరాల్లో నిరసనలకు దారితీసింది.
కాగా, గాజాపై ఇజ్రాయెల్ దాదాపు 18 సంవత్సరాలుగా దిగ్బంధనను కొనసాగిస్తోంది, మార్చిలో క్రాసింగ్‌లను మూసివేయడం, అవసరమైన సామాగ్రిని నిలిపివేయడం ద్వారా ఆంక్షలను కఠినతరం చేసింది. 2023 అక్టోబర్ 7నుండి, ఇజ్రాయెల్ దాడులు దాదాపు 66,300 మంది పాలస్తీనియన్లను చంపాయి. వీరిలో ఎక్కువమంది మహిళలు, పిల్లలు కావడం గమనార్హం.
ఫ్లోటిల్లా కార్యకర్తల అరెస్ట్…Xలో వీడియో లింక్
ఫోటిల్లా కార్యకర్తల ఇన్‌స్టాగ్రామ్ లింక్
https://www.instagram.com/p/DPXG5wYCD5Q/?utm_source=ig_web_copy_link