గాజా: ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతుల్లో నోబెల్ శాంతి బహుమతి ఒకటి. ఈ ధపా పాలస్తీనియన్ శిశువైద్యుడు, ఉత్తర గాజాలోని కమల్ అద్వాన్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ హుస్సామ్ అబు సఫియా నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు.
కమల్ అద్వాన్ హాస్పిటల్ ఉత్తర గాజాలో పనిచేస్తున్న ఏకైక ఆసుపత్రి. కాగా, 2024 డిసెంబర్ 27న డాక్టర్ హుస్సామ్ అబు సఫియా, ఇతర వైద్య సిబ్బందిని ఇజ్రాయెల్ సైన్యం అదుపులోకి తీసుకుంది.
అతని న్యాయవాది ప్రకారం… ఇజ్రాయెల్ అదుపులో ఉన్న డాక్టర్ అబు సఫియా పరిస్థితి వేగంగా క్షీణించింది, 30 కిలోలకు పైగా బరువు తగ్గారు. స్డే టీమాన్ జైలులో హింసాత్మక విచారణలు, ఓఫర్ జైలులో పేలవమైన పరిస్థితుల తర్వాత అతని ఆరోగ్యం మరింత దిగజారింది. అక్కడ అతను స్కాబిస్ వ్యాధి బారిన పడ్డాడు. ఏకాంత నిర్బంధం, పదేపదేదెబ్బలు తిన్నాడు.
అంతేకాదు అబూసఫియా అధిక రక్తపోటుతో కూడా బాధపడుతున్నాడు, మునుపటి లోతైన గాయాల కారణంగా ఇంకా సమస్యలను ఎదుర్కొంటున్నాడు.
మరోవంక ఇజ్రాయెల్ నిరంతర షెల్లింగ్ మధ్య కూడా డాక్టర్ అబు సఫియా తన రోగులను విడిచిపెట్టడానికి నిరాకరించాడు.జియోనిస్ట్ సైన్యం మరణ బెదిరింపులను పట్టించుకోలేదు. హక్కుల సంఘాలు కఠినమైన, అమానవీయ పరిస్థితుల మధ్య అతను విచారణ లేకుండా నిర్బంధంలో ఉన్నాడు.