Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

జమ్మూ కాశ్మీర్‌లో 4.7 తీవ్రతతో భూకంపం!

Share It:

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో ఈరోజు తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో 4.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనలు ఉదయం 5.35 గంటలకు సంభవించాయని, పటాన్ ప్రాంతం దీని కేంద్ర బిందువు అని వారు చెప్పారు. భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు లేవని అధికారులు తెలిపారు. కానీ ప్రజలు మాత్రం భయాందోళనకు గురయ్యారు.

ఈ భూకంప ప్రభావం కేవలం బారాముల్లాకే పరిమితం కాకుండా, గుల్బార్గ్, శ్రీనగర్ పశ్చిమ ప్రాంతాల్లో కూడా స్పష్టంగా కనిపించింది. పహల్గామ్ నుండి పశ్చిమంగా 84 కిలోమీటర్లు, కార్గిల్ నుండి నైరుతి దిశలో 166 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. కాశ్మీర్ లోయ భూకంప పరంగా అత్యంత చురుకైన (Seismic Zone V) ప్రాంతంలో ఉన్నందున తరచుగా ఇలాంటి ప్రకంపనలు నమోదవుతుంటాయి.

కాగా, భూకంప తీవ్రతకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లోయలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాల్లో భూమి ఏ స్థాయిలో కంపించిందో స్పష్టంగా రికార్డయింది. ముఖ్యంగా తెల్లవారుజామున ఒక్కసారిగా భవనాలు వీధి దీపాలు ఉగిపోవడం ఈ వీడియల్లో కనిపిస్తోంది. నెటిజన్లు ఈ దృశ్యాలను షేర్ చేస్తున్నారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.