అమరావతి: మేడారం జాతరలో కోవా బన్ విక్రయించే చిరు వ్యాపారి షేక్ వలీని యూట్యూబర్లు వేధించిన ఘటనపై ఏపీ సీఎం తనయుడు, మంత్రి నారా లోకేష్ మద్దతు ప్రకటించారు. బాధితుడికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలుగు సమాజంలో విద్వేషాలకు చోటు లేదని స్పష్టం చేశారు. త్వరలోనే వలీని కలిసి ఆయన కోవా బన్ను రుచి చూస్తానని లోకేష్ X ద్వారా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన షేక్ షేక్షా వలి అనే విక్రేతకు ఎదురైన వేధింపుల గురించి మీడియాలో వచ్చిన వార్తలపై లోకేష్ స్పందించారు. తెలంగాణలోని ములుగు జిల్లాలో గిరిజన ఉత్సవం సందర్భంగా వలీ అనే వ్యక్తిపై కొందరు యూట్యూబర్లు “ఫుడ్ జిహాద్” ఆరోపణలు చేస్తూ, బలవంతంగా కోవా బన్ తినిపించి వేధించారు, ఈ వీడియో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వలి కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధ కోవా బన్ను అమ్మడమే పెద్ద నేరమైంది.
మేడారం జాతరలో వలీ అనే వ్యక్తిపై కొందరు యూట్యూబర్లు “ఫుడ్ జిహాద్” ఆరోపణలు చేస్తూ, బలవంతంగా కోవా బన్ తినిపించి వేధించారు, ఈ వీడియో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
వలీకి అండగా ఉంటానని… త్వరలోనే ఆయనను కలుస్తానని మంత్రి తెలిపారు. వలీ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొవాల్సి వచ్చినందుకు బాధపడుతున్నానని తెలిపారు. తెలుగు సమాజంలో మతపరమైన విభజనకు స్థానం లేదని చెప్పారు. తెలుగు సమాజం ఎప్పుడూ సామరస్యం, పరస్పర గౌరవం, సోదరభావం కోసం నిలుస్తుందని మంత్రి అన్నారు
కాగా, కోవా బన్ వ్యాపారికి స్థానికుల నుండి, అలాగే అనేక మంది సోషల్ మీడియా ఇన్ప్లూయన్సర్లు, రాజకీయ పార్టీల నుండి మద్దతు లభించింది, వారు ఇటువంటి విభజన వీడియోలను తయారు చేసినందుకు యూట్యూబర్లను విమర్శించారు.
Dear Brother Vali, I am deeply sorry that you had to endure this. Such divisive and communal behavior has no place in our Telugu society, which has always stood for harmony, mutual respect, and brotherhood. I will meet you soon and look forward to tasting your famous Khoya bun!… https://t.co/AvckML9odY
— Lokesh Nara (@naralokesh) February 15, 2026
కాగా, మరో ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా వలీకి మద్దతుగా నిలిచారు. “కష్టపడి పనిచేసే ప్రతి వ్యక్తి తన జీవనోపాధిని సంపాదించుకుంటూ గౌరవంగా బతకడానికి అర్హుడు. వలిని వ్యక్తిగతంగా కలవాలనే లోకేష్ నిర్ణయాన్ని అభినందిస్తూ Xలో పోస్ట్ చేశాడు. అంతేకాదు టీడీపీ నేతలు పరిటాల శ్రీరామ్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, తదితరులు ఈ ఘటనపై స్పందించడమే కాకుండా వలీకి అండగా నిలిచారు.
అంతకుముందు, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మేడారం జాతరలో కొంతమంది యూట్యూబర్లు ముస్లింను వేధించడాన్ని తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని ఒవైసీ కోరారు, ఇటువంటి బెదిరింపులు, మతపరమైన లక్ష్యాలు ఆమోదయోగ్యం కాదని, చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరించాలని ఒవైసీ కోరారు.


