గాజా: ఇజ్రాయెల్ బాంబుల ధాటికి మరణించిన బందీలు షిరి బిబాస్, ఆమె పిల్లల అవశేషాలను హమాస్ తిరిగి ఆ దేశానికి అప్పగించింది. కానీ ఇజ్రాయెల్ చంపేసిన పాలస్తీనా పిల్లల ఆక్రందనలు, దుఃఖిస్తున్న తల్లుల రోదనలు ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి, అయినా ఇజ్రాయెల్ మిత్రదేశాలు, వారిని సమర్థించే మీడియాకు మాత్రం ఇవి వినబడటం లేదు.
గాజాలో బందీగా ఉన్న ఒక మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు సహా నలుగురు ఇజ్రాయెలీయుల మృతదేహాలను తిరిగి ఇచ్చే వేడుకలకు ప్రపంచం స్పందించినప్పటికీ, కొనసాగుతున్న మారణహోమం సమయంలో ఇజ్రాయెల్ సైన్యం నాశనం చేసిన ఇళ్ల శిథిలాల కింద వేలాది మంది పాలస్తీనా పిల్లలు, మహిళల మృతదేహాలు చిక్కుకున్న వైనం మాత్రం కనబడటం లేదు.
జనవరి 19న కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చినప్పటికీ, పాలస్తీనియన్లు ఇప్పటికీ ఈ మృతదేహాలను తిరిగి పొందడంలో ఇబ్బంది పడుతున్నారు, వీరిని వెతికేందుకు గాజాలోకి అవసరమైన పరికరాలు, భారీ యంత్రాలను ఇజ్రాయెల్ గాజాలోకి అనుమతించకపోవడం వల్ల శిధిలాల కింద మరణించిన చాలా మంది ఎముకల గూళ్లుగా మారారు. అయినా ఈ సమస్య మాత్రం ఇజ్రాయెల్ అవశేషాలను తిరిగి ఇవ్వడం వంటి పాశ్చాత్య మీడియా దృష్టిని ఆకర్షించలేదు.
మొన్న గాజాలోని హమాస్ వర్గాలు కాల్పుల విరమణ ఒప్పందం మొదటి దశలోని ఏడవ బ్యాచ్‌లో భాగంగా, షిరి బిబాస్, ఆమె పిల్లల అవశేషాలతో కూడిన నాలుగు శవపేటికలను, ఖైదీ ఓడెడ్ లిఫ్‌షిట్జ్‌తో పాటు అప్పగించాయి.
హమాస్ ఒక ప్రకటనలో బిబాస్, లివ్‌షిట్జ్ కుటుంబాలను ఉద్దేశించి ఇలా అన్నారు: “మీ ప్రియమైనవారు సజీవంగా మీ వద్దకు తిరిగి వస్తే మేము ఇష్టపడతాము, కానీ మీ సైన్యం, ప్రభుత్వ నాయకులు 17,881 మంది పాలస్తీనియన్ పిల్లలతో పాటు వారిని చంపాలని ఎంచుకున్నారు.”
గాజాలోని ధ్వంసమైన భవనాలు, ఇప్పుడు సామూహిక సమాధులుగా మారాయి. ఉదాహరణకు, పాలస్తీనియన్లు దాదాపు ఒక సంవత్సరం క్రితం కూలిపోయిన ఒక గోడపై ఇలా రాశారు: “పిల్లలు ఒమర్, అబ్దుల్లా, మాసా ఇప్పటికీ శిథిలాల కింద ఉన్నారు… “
ఈ పిల్లల చిరిగిన బొమ్మలు శిథిలాల మధ్య కనబడతాయి. ఇజ్రాయెల్ వాటిని నాశనం చేయడానికి ముందు పిల్లలు ఈ ఇళ్లలో ఒకప్పుడు ఈ చిన్నారులు నివసించారని ప్రపంచానికి స్పష్టంగా గుర్తు చేస్తాయి. ఇజ్రాయెల్ సాంకేతిక సామర్థ్యాలు, ఇళ్ళలోని వ్యక్తులను లక్ష్యంగా చేసుకునే ముందు వారి సమాచారాన్ని సేకరించడానికి వీలు కల్పించాయని మానవ హక్కుల నివేదికలు ధృవీకరించాయి.
ఇజ్రాయెల్ కాల్పుల వల్ల చనిపోతున్న పిల్లల కేకలు, చనిపోయిన పిల్లలను చూసి విలపించే తల్లుల రోదనలు ఇప్పటికీ చాలా మంది మనస్సులలో ప్రతిధ్వనిస్తుండగా, ప్రపంచం వారిపై జరిగిన మారణహోమాన్ని ఎక్కువగా విస్మరిస్తుంది, మానవ హక్కుల నివేదికలలో వారికి న్యాయం జరక్కకుండా వారి గణాంకాలను తగ్గించి చూపుతుంది.
గాజా జ్ఞాపకాల దొంతర…శిశువులకు ‘ఉరిశిక్ష’
2023 నవంబర్ 10న ఇజ్రాయెల్ సైనికులు పశ్చిమ గాజా నగరంలోని అల్-నాస్ర్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌పై దాడి చేశారు, కాల్పుల కారణంగా వైద్య సిబ్బందిని ఖాళీ చేయించారు. దళాలు అకాల శిశువులను తరలించడానికి నిరాకరించాయి, ఫలితంగా ఐదుగురు శిశువులు మరణించారు. గాజాలోని అల్-నస్ర్ పరిసరాల నుండి ఇజ్రాయెల్ వైదొలిగిన తర్వాత, శిశువుల కుళ్ళిపోయిన మృతదేహాలు వారి ఇంక్యుబేటర్లు, ఆసుపత్రి పడకలలో కనుగొన్నారు.
యూసఫ్:’గిరజాల జుట్టు’ బాలుడు
2023 అక్టోబర్ 21న ఓ పాలస్తీనా తల్లి గాజాలోని ఆసుపత్రి ప్రాంగణంలో తిరుగుతూ, గాయపడిన లేదా మరణించిన వారిలో తన 7 ఏళ్ల కుమారుడు యూసఫ్ కోసం వెతుకుతూ కనిపించింది.
సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించిన హృదయ విదారక వీడియోలో యూసఫ్ తల్లి, షాక్‌తో భయంతో, ఏడేళ్ల యూసఫ్ గిరిజాల జుట్టతో ఉన్న తన బిడ్డ మీ సంరక్షణలో ఉన్నాడా అని వైద్యులను అడిగేది. తను తెల్లగా స్వీట్‌గా ఉన్నాడు” అని వాకబు చేసింది. అయితే విషాదమేమిటంటే కొన్ని గంటల తర్వాత, ఇజ్రాయెల్ దాడిలో మరణించిన తన కొడుకు మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీలో చూసి తల్లి షాక్ అయ్యింది. ఇలా రాసుకుంటే మరెన్నో హృదయ విదారక గాథలు మనకు కనిపిస్తాయి.
‘ఇది కలా…నిజమా?’
డిసెంబర్ 2023లో, ఒక యువ పాలస్తీనా అమ్మాయి శిథిలాల నుండి బయటికిలాగుతున్న వీడియో కనిపించింది, అప్పుడా అమ్మాయి వైద్యుడిని ఇలా అడుగుతోంది:”అంకుల్, ఇది కలా నిజమా?”
డాక్టర్ ఆమెకు భరోసా ఇస్తూ, “భయపడకు… నువ్వు సురక్షితంగా ఉన్నావు” అని అన్నాడు. కానీ ఆ చిన్నారి ఇంకా షాక్ లోనే ఉండి, “నేను సురక్షితంగా ఉన్నానని నాకు తెలుసు, కానీ చెప్పండి: ఇది కలనా లేక నిజమా?” అని మళ్ళీ అడగటం ప్రతి ఒక్కరినీ కంట నీరు తెప్పిస్తోంది.
మొత్తంగా గత నెలలో ఇజ్రాయెల్, హమాస్‌ల కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చింది, ఇజ్రాయెల్ మారణహోమ యుద్ధాన్ని నిలిపివేసింది, ఈ యుద్ధం కారణంగా కనీసం 62,000 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువగా మహిళలు, పిల్లలే ఉండటం గమనార్హం. అంతేకాదు బాంబులు ఆ ప్రాంతాన్ని శిథిలావస్థకు చేర్చాయి.
గత నవంబర్‌లో, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నెతన్యాహు, అతని మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌పై గాజాలో యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అంతేకాదు గాజా ఎన్‌క్లేవ్ పై యుద్ధం చేసినందుకు ఇజ్రాయెల్ అంతర్జాతీయ న్యాయస్థానంలో జాతి నిర్మూలన కేసును కూడా ఎదుర్కొంటోంది.