గువహతి: జాతి హింసతో అల్లాడుతున్న మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా, శాంతిభద్రతల పరిస్థితిని అంచనా వేయడానికి మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా రాజ్ భవన్‌లో కీలకమైన భద్రతా సమావేశానికి అధ్యక్షత వహించారు.
మార్చి 1న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష తర్వాత, ప్రధాన కార్యదర్శి పికె సింగ్, భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్, డిజిపి రాజీవ్ సింగ్, ఉన్నత సైనిక, పారామిలిటరీ అధికారులు హాజరైన ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మార్చి 8 నుండి మణిపూర్‌లోని అన్ని రహదారులపై స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా చూడాలని అమిత్‌షా ఆదేశించడం, మే 2023 నుండి జాతి హింసకు గురైన రాష్ట్రంలో పౌర జీవనాన్ని సాధారణీకరించాలనే కేంద్రం దృఢ సంకల్పాన్ని చాటి చెబుతుంది.
ఫిబ్రవరి 13న ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ రాజీనామా తర్వాత రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో రెండు వర్గాల మధ్య అశాంతి పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
లోయలో ఆధిపత్యం వహించే మైతీ కమ్యూనిటీ, మణిపూర్‌లోని కొన్ని కొండ ప్రాంతాలలో ఆధిపత్యం వహించే కుకీల్లోని డజనుకు పైగా విభిన్న తెగలు మే 2023 నుండి భూమి హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అనేక అంశాలపై పోరాడుతున్నాయి. ఈ ఘర్షణల్లో 250 మందికి పైగా మరణించారు. 50,000 మంది నిరాశ్రయులయ్యారు.
రాష్ట్ర అసెంబ్లీ సుప్తచేతనావస్తలో ఉండటంతో, మాజీ కేంద్ర హోం కార్యదర్శి అయిన గవర్నర్ భల్లా మణిపూర్‌ను శాంతి వైపు నడిపించే బాధ్యతను చేపట్టారు.
రాష్ట్రంలోని అన్ని రహదారులపై స్వేచ్ఛగా రాకపోకలు సాగేలా చూడాలని కేంద్ర హోంమంత్రి ఆదేశం ఓ కీలకమైన పరిణామం. రాష్ట్రాన్ని మెయిటీ ఆధిపత్య లోయలు, కుకి నియంత్రిత కొండలుగా విభజించినందున, ప్రయాణాలపై భారీగా పరిమితి నెలకొంది..
దోచుకున్న ఆయుధాలను తిరిగి అప్పగించేందుకు గవర్నర్ అల్టిమేటం తర్వాత 4,100కు పైగా
ఆయుధాలు అప్పగించారు. మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌లను నిర్వీర్యం చేయడం ద్వారా
శాంతిని పునరుద్ధరించడానికి మార్గం సుగమమైంది. మరోవంక అక్రమ సరిహద్దు కార్యకలాపాలను అరికట్టడానికి కేంద్రం ఇండో-మయన్మార్ సరిహద్దులో కంచె వేయడానికి కూడా ప్రాధాన్యతనిచ్చింది.
మణిపూర్ గవర్నర్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన సమావేశంలో భద్రత, సయోధ్యకు ప్రాధాన్యత ఇచ్చి…స్థానిక రాజకీయ వర్గాలను పక్కన పెట్టడంతో, రాష్ట్రపతి పాలనలో కేంద్రీకృత నియంత్రణ వైపు మార్పును సూచిస్తాయి.
జాతి హింసతో అల్లాడుతున్న రాష్ట్రంలో, హోం మంత్రి అమిత్‌షా రోడ్ మ్యాప్ విజయం..సమాజ విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. మరోవంక మార్చి 8 సమీపిస్తున్న తరుణంలో, స్వేచ్ఛా ఉద్యమం శాశ్వత శాంతికి మార్గం సుగమం చేస్తుందా లేదా అన్నది చూడాలి.