వాషింగ్టన్: గాజాలో ఉన్న బందీలను వెంటనే విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో రాశారు.
‘షాలోమ్ హమాస్’ అంటే హలోనా? గుడ్ బైనా?.. ఏదో మీరే ఎంచుకోండి. బందీలందరినీ వెంటనే విడుదల చేయండని హమాస్‌ను బెదిరించారు . మీరు విడుదల చేసిన కొందరు బందీలను నేను కలిశాను. ఇదే మీకు నా చివరి హెచ్చరిక. గాజాను వెంటనే వీడండి. ఇదే మీకు చివరి అవకాశం. మీరు చంపిన వారి మృతదేహాలను కూడా తిరిగి అప్పగించండి. లేకుంటే మీ కథ ముగిసినట్లే. మానసిక ఉన్మాదులు మాత్రమే ఇలా మృతదేహాలను తమ వద్ద ఉంచుకుంటారు. నేను చెప్పింది చేయకుంటే, ఒక్క హమాస్ సభ్యుడు కూడా మిగలడు. అందుకే.. పని పూర్తి చేయడానికి అవసరమైనవన్నీ ఇజ్రాయెల్ కు పంపుతున్నాను.” అని ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్టులో హమాస్‌ను తీవ్రంగా హెచ్చరించారు.
కాగా, బందీలపై హమాస్‌తో ప్రత్యక్ష చర్చలు జరుపుతున్నట్లు వైట్ హౌస్ ధృవీకరించిన కొన్ని గంటల తర్వాత ఇది జరిగిందని BBC నివేదించింది. మరోవంక గాజా పౌరులను కూడా ట్రంప్ బెదిరించాడు: “అలాగే, గాజా ప్రజలకు: ఒక అందమైన భవిష్యత్తు వేచి ఉంది, కానీ మీరు బందీలను ఉంచుకుంటే కాదు. మీరు అలా చేస్తే, మీరు చనిపోవడం ఖాయమని అన్నాఉ. !”
ట్రంప్ హమాస్‌ను బెదిరించడం ఇదే మొదటిసారి కాదు. డిసెంబర్‌లో, తాను పదవీ బాధ్యతలు స్వీకరించే సమయానికి బందీలను విడుదల చేయకపోతే “మీరు నరకం అనుభవించాల్సి వస్తుందని” ట్రంప్ వ్యాఖ్యానించినట్లు BBC తెలిపింది.
మరోవంక , బందీలను విడుదల చేయడానికి అమెరికా హమాస్‌తో ప్రత్యక్ష చర్చలు జరుపుతోందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ధృవీకరించారు. చర్చలకు ముందు ఇజ్రాయెల్‌తో సంప్రదింపులు జరిపామని ఆయన అన్నారు. అమెరికన్ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడంలో అధ్యక్షుడు ట్రంప్ నమ్మకం ఉంచారని లీవిట్ విలేకరులతో అన్నారు. ఈ సందర్భంగా బందీల విడుదల కోసం నియమితమైన ప్రత్యేక రాయబారి ఆడమ్ బోహ్లర్ ట్రంప్ వ్యాఖ్యలను సమర్థించారు.
కాగా, హమాస్, ఒక అమెరికన్ అధికారి మధ్య “రెండు ప్రత్యక్ష సమావేశాలు” జరిగాయని, “తరువాత అనేక సార్లు సమాచార మార్పిడి” జరిగిందని పాలస్తీనా వర్గాలు బిబిసికి తెలిపాయి. గాజాలో ఇంకా 59 మంది బందీలు ఉన్నారని, వారిలో 24 మంది బతికే ఉన్నారని ఇజ్రాయెల్ తెలిపింది. బందీలలో అమెరికన్ పౌరులు కూడా ఉన్నారు.
అమెరికన్ బందీలను విడుదల చేయడంతో పాటు యుద్ధాన్ని ముగించడానికి విస్తృత ఒప్పందంపై చర్చించడానికి ఇరుపక్షాలు ఖతార్‌లో సమావేశమవుతున్నాయని ఆయా వర్గాలు తెలిపాయి.
మరోవంక ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో ప్రత్యక్ష చర్చలపై “తమ వైఖరిని వ్యక్తం చేశామని” తెలిపింది కానీ మరిన్ని వివరాలు ఇవ్వలేదు. నివేదికల ప్రకారం, బోహ్లర్ ఇటీవలి వారాల్లో ఖతార్ రాజధాని దోహాలో హమాస్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.