గువహతి: బంగ్లాదేశ్ మీదుగా దేశంలోని మిగిలిన ప్రాంతాలతో ఈశాన్య ప్రాంతం కనెక్టివిటీని పెంచాలని మేఘాలయ ప్రభుత్వం డిమాండ్ చేసింది. హిలి-మహేంద్రగంజ్ ట్రాన్స్‌నేషనల్ ఎకనామిక్ కారిడార్‌తో ఇది సాధ్యమవుతుందని తెలిపింది.
కాగా హిలి పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దు పట్టణం కాగా, మహేంద్రగంజ్ మేఘాలయ గారో హిల్స్ ప్రాంతంలో సరిహద్దు పట్టణం. ఈ రెండు ప్రాంతాలు బంగ్లాదేశ్‌తో సరిహద్దును పంచుకుంటాయి.
ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా కోల్‌కతా నుండి తురా, బాగ్మారా, డాలు, డాకి వంటి వృద్ధి కేంద్రాలకు 100 కి.మీ రోడ్డు మార్గం నిర్మిస్తే… ప్రయాణ సమయం, అందుకయ్యే ఖర్చును 25-60 శాతం తగ్గించే అవకాశం ఉందని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా అన్నారు. ప్రస్తుతం, ఎన్‌హెచ్‌ఐడిసిఎల్ తయారుచేసిన రహదారి అలైన్మెంట్ ఈ ప్రాజెక్ట్ కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం బంగ్లాదేశ్‌తో సంప్రదింపులు జరుపుతాయి.
పశ్చిమ బెంగాల్‌లోని హిల్లి మరియు మేఘాలయలోని మహేంద్రగంజ్ మధ్య బంగ్లాదేశ్ ద్వారా అనుసంధానం జరిగితే, మేఘాలయ, బరాక్ వ్యాలీ, త్రిపుర వంటి ప్రదేశాలు కోల్‌కతాతో తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు. 600-700 కి.మీ.లు తగ్గుందని సీఎం సంగ్మా అన్నారు.
“ఇది సమాంతర ఆర్థిక కారిడార్ అవుతుంది. కానీ ఇది ఎప్పుడు జరుగుతుందో చెప్పడం కొంచెం కష్టం ఎందుకంటే దీనికి బంగ్లాదేశ్ ప్రభుత్వం సంబంధం ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఆ దేశంలో పాలన మారడానికి ముందు, న్యూఢిల్లీ… ఢాకాతో చర్చించింది. అది ప్రధాన మంత్రుల స్థాయి సమావేశం. మేము దాని కోసం మళ్ళీ ఒత్తిడి చేస్తాము” అని మేఘాలయ సీఎం అన్నారు.