డమాస్కస్: సిరియాలో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. మాజీ అధ్యక్షుడు అసద్ విధేయులు, సిరియా భద్రతా దళాలకు మధ్య రెండు రోజులపాటు జరిగిన హింసలో వెయ్యిమందికిపైగా మరణించారు. ఇది 14 సంవత్సరాల క్రితం సిరియాలో వివాదం ప్రారంభమైనప్పటి నుండి జరిగిన అత్యంత ఘోరమైన హింసాత్మక ఘటనలలో ఒకటిగా నిలిచింది. వీధుల్లో ఎక్కడ చూసిన మృతదేహాలే కన్పిస్తున్నాయి.
బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఘర్షణకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. అసద్ మద్దతుదారులు తొలుత ప్రభుత్వ భద్రతా దళాలపై దాడులు ప్రారంభించారు. దీనికి ప్రతిగా భద్రతా బలగాలు ఎదురుదాడికి దిగాయి. ఇప్పటివరకు ఈ ఘర్షణ కారణంగా మరిణించిన వారిలో 715 మంది సాధారణ పౌరులు ఉండగా.. 125 మంది భద్రతా బలగాలు, 148 మంది అసద్ మద్దతుదారులు ఉన్నారు. అంతేకాదు అసద్ మద్దతుదారులైన అలావైట్స్ లటాకియా నగరం చుట్టూ ఉన్న పెద్ద ప్రాంతాలలో విద్యుత్, తాగునీరు నిలిపివేసారని ఈ బ్రిటన్ సంస్థ పేర్కొంది.
గురువారం చెలరేగిన ఈ ఘర్షణలు, అస్సాద్‌ను అధికారం నుండి తొలగించిన తర్వాత తిరుగుబాటుదారులు అధికారం చేపట్టిన మూడు నెలల తర్వాత డమాస్కస్‌లో కొత్త ప్రభుత్వానికి సవాలును పెంచాయి. కాగా, సిరియాలో మూడు నెలల క్రితం తిరుగుబాటుదారులు అసద్ నుంచి అధికారాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే తిరుగుబాటుదారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ గురువారం అసద్ మద్దతుదారులు ఆ నగరంలో భద్రతా సిబ్బందిని మట్టుపెట్టాయి. అసర్ తెగకు చెందిన అలావైట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రవేశించిన ప్రభుత్వ దళాలు పెద్ద ఎత్తున ప్రతీకార దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో వారి ఇళ్లకు నిప్పంటిచడంతో ఘర్షణలు పెద్దవయ్యాయి. పట్టణంలో జరిగిన ఘర్షణల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలు ఇళ్లలో పడి ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. వాటిని తీసుకునేందుకు కూడా ఎవరూ సాహసం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా, శనివారం తెల్లవారుజామున ప్రతీకార హత్యలు ఆగిపోయాయని అబ్జర్వేటరీ చీఫ్ రామి అబ్దుర్రహ్మాన్ అన్నారు. మరోవంక సిరియా అధికారిక వార్తా సంస్థ పేరు తెలియని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిని ఉటంకిస్తూ, ప్రభుత్వ దళాలు అసద్ విధేయుల నుండి చాలా ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాయని పేర్కొంది. మరోవైపు, సిరియా హింసపై ఫ్రాన్స్ తీవ్ర ఆందోళవ వ్యక్తం చేసింది. మతప్రాతిపదికన పౌరులపై, ఖైదీలపై జరిగిన దారుణాలను ఖండిస్తున్నట్లు ఫ్రాన్స్ విదేశాంగ శాఖ పేర్కొంది.