వాషింగ్టన్: గాజాలో ఇజ్రాయెల్ వైమానిక, భూ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడాన్నిఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు, హింసకు హమాస్ కారణమని ఆరోపించారు.
గాజా కాల్పుల విరమణను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారా అని విలేకరులు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీని అడగ్గా… “ఇజ్రాయెల్, ఐడిఎఫ్ తాజాగా చేపట్టిన చర్యలకు ట్రంప్ పూర్తిగా మద్దతు ఇస్తున్నారు” అని లీవిట్ విలేకరులతో అన్నారు.
“బందీలందరినీ విడుదల చేయకపోతే నరకం తప్పదని హమాస్‌కు చాలా స్పష్టంగా చెప్పారు. దురదృష్టవశాత్తు హమాస్ ప్రజల ప్రాణాలతో ఆట ఆడాలని చూస్తోందని ఆయన అన్నారు.”
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడికి దిగడం హమాస్ చేసిన తప్పు అని లీవిట్ అన్నారు, పాలస్తీనా మిలిటెంట్లు స్వాధీనం చేసుకున్న “ఆ బందీలందరినీ” విడుదల చేయాలని ట్రంప్ కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
ఇజ్రాయెల్ తాజాగా జరిపిన దాడిలో ఇప్పటివరకు 504 మంది మరణించారని, వారిలో 190 మందికి పైగా పిల్లలు ఉన్నారని గాజా పౌర రక్షణ సంస్థ తెలిపింది. గతంలో జరిగిన మరణాల సంఖ్య కనీసం 470.
జనవరి 19న కాల్పుల విరమణ ఒప్పందం ప్రారంభమైనప్పటి నుండి యుద్ధంలో దెబ్బతిన్న పాలస్తీనా భూభాగంలో నెలకొన్న ప్రశాంతతను తిలోదకాలు ఇచ్చిన ఇజ్రాయెల్… మంగళవారం తెల్లవారుజామున గాజాపై భీకర వైమానిక దాడులతో తిరిగి యుద్ధాన్ని ప్రారంభించింది.
పెరుగుతున్న పౌర మరణాల సంఖ్యకు మొదటి సైనిక ప్రతిస్పందనగా గురువారం ఇజ్రాయెల్ వాణిజ్య కేంద్రం టెల్ అవీవ్‌పై రాకెట్లను ప్రయోగించినట్లు హమాస్ పేర్కొంది. మరోవంక ఇజ్రాయెల్ బుధవారం తిరిగి ప్రారంభించిన భూతల యుద్ధాన్ని రక్షక దళాలు విస్తరించడంతో ఆ ప్రాంతం ప్రధాన ఉత్తర-దక్షిణ మార్గాన్ని మూసివేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.