ఇంఫాల్: మణిపూర్లో దుండగులకు ఆయుధాలు సరఫరా చేసారని ఓ ఎమ్మెల్యేపై మైతీ వర్గానికి చెందిన అత్యున్నత కమిటీ అభియోగం మోపింది. దీనిపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది.
అయితే ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే నుండి తక్షణ స్పందన రాలేదు. ఈ అభియోగంపై అతన్ని సంప్రదించేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి.
సదరు”ఎమ్మెల్యే అనేక సమావేశాలు నిర్వహించాడు… ఆర్థిక సహాయం, ఆయుధాలతో దుండగులకు మద్దతు ఇచ్చాడు. కానీ ముస్లింలు మెయిటీలతో శాంతియుతంగా జీవించాలనుకుంటున్నారు. కాబట్టి అతని ప్రణాళిక విఫలమైంది” అని జిరి అపున్బా లూప్ ఒక ప్రకటనలో తెలిపారు.
మే 2023 నుండి మెయిటీలు, కుకి-జో గ్రూపుల మధ్య జరిగిన జాతి హింసలో మణిపూర్లో 250 మందికి పైగా మరణించారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కాగా, మణిపూర్ సీఎం ఎన్ బిరెన్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత ఫిబ్రవరి 13న ఆ రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. 2027 వరకు పదవీకాలం ఉన్న రాష్ట్ర అసెంబ్లీని సస్పెండ్ చేశారు.