వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా వాల్ స్ట్రీట్‌లో గణనీయమైన నష్టాలను అమెరికా ఫ్యూచర్స్ సూచించాయి. ట్రంప్ టారిఫ్‌ల భయంతో నేడు ఆసియా స్టాక్ మార్కెట్లు బ్లడ్‌బాత్‌తో ప్రారంభమయ్యాయి, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ భారీగా నష్టపోయి బ్లాక్‌మండేను తలపించింది.
కాగా, పడిపోతున్న మార్కెట్ల గురించి ట్రంప్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు అనారోగ్యాన్ని బాగు చేసుకోవాలంటే చేదుగా ఉన్నా సరే మెడిసిన్ తీసుకోవాల్చి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇక, వాణిజ్య లోటు పరిష్కారమయ్యేవరకు సుంకాలు తగ్గించే ప్రసక్తే లేదని, ఇతర దేశాలతో ఒప్పందం కుదుర్చుకోనని అన్నారు. ఈ వారాంతంలో దీనిపై పరిష్కారం కోసం ప్రపంచ నాయకులతో చర్చలు జరిపానని, “వారు ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆత్రంగా ఉన్నారు” అని ట్రంప్ అన్నారు.
మార్కెట్ రక్తపాతం కొనసాగుతోంది
నేడు జపాన్ నిక్కీ ఇండెక్స్ 7 శాతానికి పైగా పడిపోయింది, గత వారం ట్రంప్ చేసిన టారిప్ బాంబు ప్రకటన ప్రభావం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తూనే ఉంది. టోక్యోలో నిక్కీ 225 7.35 శాతం శాతం క్షీణించింది, శుక్రవారం 2.75 శాతం తగ్గింది, సియోల్‌లో, కోస్పి 4.8 శాతం తగ్గింది.
హాంకాంగ్‌లో స్టాక్‌లు కూడా తొమ్మిది శాతానికి పైగా పడిపోయాయి. సింగపూర్‌లో కూడా షేర్లు సోమవారం ప్రారంభంలో ఏడు శాతానికి పైగా పడిపోయాయి. ఆసియా అంతటా మార్కెట్లు ఫ్రీ ఫాల్‌లోకి వెళ్లడంతో స్ట్రెయిట్స్ టైమ్స్ ఇండెక్స్ 7.37 శాతం వద్దకు చేరుకుంది.
దేశంలోని అతిపెద్ద 200 లిస్టెడ్ కంపెనీల బెంచ్‌మార్క్ ఇండెక్స్ అయిన ఆస్ట్రేలియన్ బ్లూ-చిప్ స్టాక్‌లు కూడా నేడు ట్రేడింగ్ ప్రారంభమైన నిమిషాల్లోనే 6 శాతం పతనమయ్యాయి. స్టాక్‌లు ప్రారంభంలో 9.8 శాతం క్షీణించడంతో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో సర్క్యూట్ బ్రేకర్ ప్రారంభమైంది.
నేడు భారతీయ షేర్లు కూడా బాగా తగ్గాయి. ఉదయం ప్రీ-ఓపెన్ ట్రేడ్‌లో నిఫ్టీ 50.5 శాతం క్షీణించి 21,758.4 వద్ద ముగిసింది, బిఎస్‌ఇ సెన్సెక్స్ 5.29 శాతం క్షీణించి 71,379.89 వద్ద ముగిసింది. 13 ప్రధాన రంగాల స్టాక్స్ అన్నీ క్షీణించాయి. స్మాల్-క్యాప్స్ 10 శాతం , మిడ్-క్యాప్స్ 7.3 శాతం నష్టపోయాయి.
చైనా, ఈయూ దేశాలతో భారీ ఆర్థికలోటుకు సుంకాలే తగిన పరిష్కారమని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తన చర్యల ఫలితంగా అమెరికాలోకి బిలియన్ డాలర్ల ప్రవాహం మొదలైందని వ్యాఖ్యానించారు. టారిప్ అంశంపై ఇప్పటికే భారత్ సహా 50 దేశాలు అమెరికా సర్కారుతో చర్చలు జరుపుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.