న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంచడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా విధించిన “సుంకాల”కు తగిన సమాధానం ఇచ్చారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న ప్రజలకు “ప్రభుత్వ దోపిడీ” అనే మరో బహుమతిని ఇచ్చారని కూడా రాహుల్ అన్నారు.
ప్రభుత్వం పెట్రోల్ – డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.2 చొప్పున పెంచింది. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.13 కు, డీజిల్ పై లీటరుకు రూ.10 కు పెంచారు
ఈమేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే Xలో “వాహ్, మోడీ జీ, వాహ్” అని పోస్ట్ చేశారు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు మే 2014 తో పోలిస్తే 41 శాతం తగ్గాయి, కానీ మీ దోపిడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడానికి బదులుగా, కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని రూ.2 పెంచింది.” “స్టాక్ మార్కెట్లో చిన్న,పెద్ద పెట్టుబడిదారులు అమెరికా మనపై విధించిన టారిఫ్ కారణంగా ఒకేసారి రూ.19 లక్షల కోట్లు కోల్పోయిన తర్వాత కూడా మీరు సంతృప్తి చెందలేదు, సరికదా మీ ప్రభుత్వం గాయాలపై ఉప్పు రుద్దడానికి వచ్చిందని ఆయన అన్నారు.”
ఎల్‌పిజి సిలిండర్ ధరల పెంపుపై ఖర్గే విమర్శలు
“ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్లు కూడా ధరల పెంచడాన్ని కూడా ఖర్గే విమర్శించారు. మోడీ జీ ఈసారి వంటింటి ఖర్చులపై కూడా కొరడా ఝళిపించారు. దోపిడీ, మోసం అన్నీ మోడీ ప్రభుత్వానికి పర్యాయపదాలుగా మారాయి” అని ఆయన Xలో చేసిన మరొక పోస్ట్‌లో అన్నారు
మరోవంక పన్నులలో ఏదైనా మార్పు సాధారణంగా వినియోగదారులకు బదిలీ చేస్తారు. అయితే అంతర్జాతీయ చమురు ధరల తగ్గుదల కారణంగా రిటైల్ ధరల తగ్గింపుకు వ్యతిరేకంగా ఎక్సైజ్ పెంపు ఉంటుంది కాబట్టి పెట్రోల్, డీజిల్ రిటైల్ అమ్మకపు ధరలలో ఎటువంటి మార్పు ఉండదు.
“ఈరోజు ఎక్సైజ్ సుంకం రేట్ల పెరుగుదల తర్వాత పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలలో ఎటువంటి పెరుగుదల ఉండదని PSU చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలియజేశాయి, చమురు మంత్రిత్వ శాఖ X పోస్ట్‌లో తెలిపింది.