హైదరాబాద్: తెలంగాణ ప్రస్తుతం అసాధారణ వాతావరణ పరిస్థితులను చూస్తోంది, కొన్ని చోట్ల వర్షపాతం నమోదవుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వాతావరణంలోని ఈ మార్పు ఇటు ప్రజలు అటు అధికారుల దృష్టిని ఆకర్షించింది. నిజామాబాద్,హైదరాబాద్ రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలను నమోదు చేశాయి, దీనివల్ల ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు.
ఇదేసమయంలో ఇతర ప్రాంతాలలో అప్పుడప్పుడు వర్షాలు తాత్కాలిక ఉపశమనం కలిగించాయి. కానీ వాతావరణ మార్పులు ప్రజల్లో అయోమయం రేకెత్తించింది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు వర్షం,వేడిగాలుల హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలోని ఏడు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. వీటిలో ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల ఉన్నాయి.
వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, హైడ్రేటెడ్‌గా ఉండాలని, వాతావరణ సూచనలపై తగు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సలహా ఇస్తున్నారు.