జెరూసలేం : ఇజ్రాయెల్ సైనికులు సరిహద్దు వెంబడి బఫర్ జోన్ ప్రాంతాన్ని స్థాపించడానికి గాజాలో విస్తృతమైన విధ్వంసం, హత్యలను వివరిస్తూ వివరణాత్మక సాక్ష్యాలను అందించారని ఇజ్రాయెల్ గ్రూప్ బ్రేకింగ్ ది సైలెన్స్ కొత్త నివేదిక తెలిపింది.
బఫర్ జోన్ ప్రణాళికను అమలు చేయడంలో పాల్గొన్న దళాల వివరాలను నివేదిక సంకలనం చేసింది. “ఈ మిషన్లలో ఒకటి గాజా లోపల ‘బఫర్ జోన్’ని సృష్టించడం, అంటే ఆచరణలో ఆ ప్రాంతాన్ని నేలమట్టం చేయడం. ఉద్దేశపూర్వక విధ్వంసం ద్వారా, సైన్యం ఆ ప్రాంతంపై భవిష్యత్తులో ఇజ్రాయెల్ నియంత్రణకు పునాది వేసింది” అని ఆ బృందం తెలిపింది.
సైనికులు బఫర్ జోన్‌గా పిలిచే ఈ ప్రాంతం గాజా ఉత్తర తీరం నుండి ఈజిప్టు దక్షిణ సరిహద్దు వరకు విస్తరించి ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇది పూర్తిగా గాజాలోపల, ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సరిహద్దులకు ఆవల ఉంది. ఆ బృందం ప్రకారం, మునుపటి బఫర్ జోన్ గాజాలోకి దాదాపు 300 మీటర్లు విస్తరించి ఉంది. కొత్త జోన్ 800 నుండి 1,500 మీటర్ల వెడల్పుతో ఉంటుంది, ఇది దాదాపు 55–58 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ప్రభావితం చేస్తుంది – 35 శాతం వ్యవసాయ భూమితో సహా … ముట్టడిలో ఉన్న ఈ ప్రాంతంలోని దాదాపు 16 శాతం భూమిని ఇది ప్రభావితం చేస్తుంది.
“నవంబర్ (2023)లో ఆపరేషన్స్ రూమ్‌లో కమాండర్లు చెప్పినది ఏమిటంటే, యుద్ధం ఒక సంవత్సరం పాటు ఉంటుందని, ప్రతిదీ క్లియర్ చేయబడే ప్రాంతాన్ని మనం జయించబోతున్నాం” అని సైన్యం ఉత్తర గాజా విభాగంలోని ఒక మేజర్ అన్నారు.
2024 జనవరి, ఫిబ్రవరిలో జరగనున్న కార్యకలాపాల గురించి చర్చిస్తూ, ఆర్మర్డ్ కార్ప్స్ నాన్-కమిషన్డ్ అధికారి మాట్లాడుతూ, ఆ ప్రాంతంలో అక్కడ పౌర జనాభా లేదు. అక్కడున్నవారందరూ ఉగ్రవాదులు. ఎవరూ నిర్దోషులు కాదని దళాలకు చెప్పారని ఆయన అన్నారు:
వారి ఆదేశానుసారం మేము పాలస్తీనియన్ల ఇళ్ల లోపలికి వెళ్తాము, అనుమానితులను గుర్తిస్తే, మేము వారిని కాల్చివేస్తామని ఆ అధికారి అన్నాడు. అంతేకాదు సాయుధ బుల్డోజర్ సాయంతో విధ్వంసాన్ని సృష్టిస్తామని,. ఇళ్లు, తోటలు, ఆవుల కొట్టాలు, కోళ్ల గూళ్లూ ఇలా ప్రతిదాన్ని నాశనం చేయడమే మా పని ఆ సైనికాధికారి వివరించాడు.
శిథిలాల కుప్ప
రిజర్వ్ బెటాలియన్ 5లో మొదటి సార్జెంట్ అయిన మరొక సైనికుడు మాట్లాడుతూ…డిసెంబర్ 2023- జనవరి 2024 మధ్య ఖుజాలో… ఖాన్ యూనిస్ ఖాన్‌లో తమ ప్రధాన పని.. కూల్చివేత మాత్రమే అని చెప్పాడు: “నేను వందలాది నిర్మాణాల విధ్వంసంలో పాలుపంచుకున్నానని అతను చెప్పాడు.
గాజా డివిజన్ రంగులను ఉపయోగించి విధ్వంస మండలాలను మ్యాప్ చేసిందని ఆయన వివరించారు: “ఆకుపచ్చ అంటే 80 శాతం కంటే ఎక్కువ భవనాలను కూల్చివేశారని అర్థం అని తెలిపాడు.
నవంబర్ 2023లో ఉత్తర గాజాలో పనిచేసిన కంబాట్ ఇంజనీరింగ్ కార్ప్స్లో ఒక మొదటి సార్జెంట్ మాట్లాడుతూ… “మేము ఇళ్లను కూల్చివేస్తాము, వాటిని పడగొడతాము, కాబట్టి అక్కడ ఒట్టి శిథిలాల కుప్ప తప్ప మరేమీ మిగల్లేదు అని చెప్పాడు.”
కూల్చివేత పనులను రోజువారీ పనులుగా ఆయన వర్ణించారు: “రోజు ఉదయం లేచి నిర్మాణాలను కూల్చివేయడమే మాపని. మా దగ్గర పేలుడు పదార్థాలు అయిపోతే తప్ప విధ్వంసాన్ని ఆపే ప్రసక్తే లేదు.” ప్లాటూన్లు వారానికి 40-50 ఇళ్లను కూల్చివేయవచ్చని ఆయన అన్నారు: కూల్చడానికి ప్రతి ఇంటికి అరగంట సమయం మాత్రమే పడుతుందని అన్నారు.
మొత్తంగా మార్చి 18న ఇజ్రాయెల్ సైన్యం గాజాపై తన దాడిని తిరిగి ప్రారంభించింది, అప్పటి నుండి దాదాపు 1,400 మంది మరణించారు, 3,400 మందికి పైగా గాయపడ్డారు.