హైదరాబాద్: నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ ఇటీవల సైబర్ దాడికి గురయ్యాడు, ఫలితంగా అతని బ్యాంక్, యుఎస్ షేర్ మార్కెట్ ఖాతాల నుండి రూ.42 లక్షలు కోల్పోయాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే… మార్చిలో జరిగిన ఈ సైబర్ దాడిలో, హ్యాకర్లు OTP కూడా అడగకుండానే అనధికారికంగా అతడి అకౌంట్‌లోని డబ్బుని కొట్టేశారు. పనిలోపనిగా బాధితుడి వాట్సాప్ ఖాతాను కూడా హ్యాక్ చేశారు. దీనిని పునరుద్ధరించడానికి డబ్బును డిమాండ్ చేశారు.
యుఎస్ షేర్ మార్కెట్‌లో పెట్టుబడిదారుగా ఉన్న హైదరాబాద్ టెక్నీషియన్ 10 రోజుల వ్యవధిలో అనేక లావాదేవీలు నిర్వహించిన తర్వాత తన పాస్‌వర్డ్ దొంగిలించారని పసిగట్టాడు. ప్రారంభంలో ఆ వ్యక్తి తన పేరు మీద తెరిచిన కొత్త ఖాతాల నుండి ఇమెయిల్‌లను అందుకున్నాడు. డబ్బు బదిలీ, అనేక సార్లు డబ్బులు డెబిట్ అయిన తర్వాత, అతను ఈ సంఘటనను సైబర్ క్రైమ్ పోలీసులకు నివేదించాడు.బాధితుడి డబ్బును హ్యాకర్లు అనేక ఖాతాలకు బదిలీ చేశారు. అతనికి తెలియకుండానే అకౌంట్‌నుండి డబ్బులు మాయమయ్యాయి.
ఇలాంటిదే మరో కేసులో, హైదరాబాద్ వ్యాపారవేత్త ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసంలో రూ. 1.22 కోట్లు కోల్పోయాడు, హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ విభాగం… ఇటువంటి మోసాలపై చురుకుగా పోరాడుతోంది, బాధితుల నుండి గణనీయమైన మొత్తాలను తిరిగి పొందింది. భారతదేశం అంతటా ఇలాంటి కేసులు నమోదయ్యాయి, ఇక్కడ హ్యాకర్లు ఎలక్ట్రానిక్ లావాదేవీలు ఇంటర్నెట్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లలో లొసుగులను ఉపయోగిస్తున్నారు.