న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టం తదుపరి విచారణ వరకు ‘వక్ఫ్ బై యూజర్’ లేదా ‘వక్ఫ్ బై డీడ్’ ఆస్తులను డీ నోటిఫై చేయరాదని, వాటి స్థితిని మార్చకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. . ఈ సందర్భంగా వక్ఫ్‌పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం రోజులు గడువు కోరగా.. సీజేఐ జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం అంగీకరించింది.
తదుపరి విచారణ వరకు వక్స్ ఆస్తులను డీనోటీఫై చేయబోమని కేంద్రం తెలిపింది. అయితే, అప్పటివరకు వక్స్ కౌన్సిల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించవద్దని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను సర్వోన్నత న్యాయస్థానం మే 5కు వాయిదా వేసింది.
ఏదైనా వక్ఫ్ ఆస్తి రిజిస్ట్రేషన్ మునుపటి 1995 చట్టం ప్రకారం జరిగి ఉంటే, ఆ ఆస్తులను మే 5న తదుపరి విచారణ వరకు డీనోటిఫై చేయలేమని CJI అన్నారు. కొత్తగా సవరించిన వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లకు ప్రాథమిక ప్రతిస్పందనను దాఖలు చేయడానికి మెహతా వారం రోజులు కోరిన తర్వాత ధర్మాసనం ఈ ఉత్తర్వును జారీ చేసింది.
వక్స్ ఆస్తులు, నియామకాలపై స్టేటస్ కో విధిస్తున్నాం. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు వారం రోజుల్లో సవివర రిప్లై దాఖలు చేయాలి. మరో ఐదు రోజుల్లో రిజైన్దర్ దాఖలు చేయాలి” అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జగ్జిన్ కె.వి. విశ్వనాథన్ త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.
మరోవైపు, ఈ అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను పరిష్కరించడం అసాధ్యమని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై ఎవరెవరు వాదనలు వినిపించాలో.. న్యాయవాదులు తమలో తాము నిర్ణయించుకోవాలని.. తాము కేవలం ఐదు పిటిషన్లను మాత్రమే విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.